Naga Chaitanya – Sobhita Dhulipala : సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన నాగ చైతన్య గురించే చర్చ. ఎందుకంటే ఆయన రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. చాలా కాలం నుండి ఆమెతో రహస్యంగా డేటింగ్ చేస్తూ వచ్చిన ఆయన, ఇక ఆ రహస్య బంధానికి తెరదించుతూ, మొత్తానికి రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు. సమంత, నాగ చైతన్య విడిపోయిన తర్వాత ప్రతీ ఒక్కరు సమంతానే నిందించారు. ఆమెదే తప్పు అంటూ కామెంట్స్ చేసారు. కానీ సమంత తప్పు ఏమాత్రం లేదని, వీళ్లిద్దరి రహస్య బంధం తెలిసిన తర్వాతనే సమంత నాగ చైతన్య తో విభేదించి విడాకులు తీసుకుంది అంటూ నెటిజెన్స్ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు.
ఈ సంఘటనతో సమంత మీద ఒక్కసారిగా అందరిలో సానుభూతి పెరిగిపోయింది. ఇదంతా పక్కన పెడితే శోభిత దూళిపాళ్ల గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు బయటపడింది. నాగ చైతన్య తో ప్రేమలో పడకముందు శోభిత ప్రణవ్ మిశ్రా అనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమాయణం నడిపిందట. చాలా కాలం వరకు అతనితో డేటింగ్ చేసిన ఈమె మధ్యలో ఏర్పడిన కొన్ని అనుకోని మనస్పర్థల కారణంగా విడిపోవాల్సి వచ్చిందట. ప్రణవ్ ని ఎంతో గాఢంగా ప్రేమించిన శోభిత, అతనితో విడాకులు తీసుకున్న తర్వాత మానసికంగా ఎంతో కృంగిపోయిందట. అలాంటి సమయం లోనే ఆమెకి నాగ చైతన్య స్నేహితుడిగా పరిచయం అవ్వడం, ఆ స్నేహం కాస్త పెరిగి పెరిగి ప్రేమగా మారడం జరిగింది. ఇకపోతే వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క చిత్రం లో కూడా నటించకపోవడం మరో ఆసక్తికరమైన విషయం.
నాగార్జున మేనకోడలు సుప్రియ కి స్నేహితురాలైన శోభిత, ఆమె ద్వారానే నాగ చైతన్య కి పరిచయం అయ్యిందట. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వం లో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సుమారుగా 75 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య ఈ సినిమా తో భారీ కం బ్యాక్ ఇవ్వాలని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు.