Akkineni Naga Chaitanya : నేడు శోభితతో అక్కినేని నాగ చైతన్య నిశ్చితార్థం..వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్స్!

- Advertisement -

Akkineni Naga Chaitanya : నాగ చైతన్య సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉన్నాడని, వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఇవి కేవలం రూమర్స్ అని చాలా మంది కొట్టిపారేశారు. కానీ అది రూమర్స్ కాదని, నిజమని నేడు తేలింది. మీరు వింటున్నది నిజమే, నేడు అక్కినేని నాగార్జున ఇంట్లో నాగ చైతన్య – శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం జరుగబోతోంది. ఈ నిశ్చితార్ధ వేడుకకి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు ఈ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించబోతుంది. నాగ చైతన్య ఇంతకు ముందు అనేకసార్లు శోభిత తో కలిసి ఫోటోలు దిగడం, కలిసి టూర్స్ వెళ్లడం, ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం వంటివి సోషల్ మీడియా లో చాలా సార్లు గమనించాము.

Akkineni Naga Chaitanya
Akkineni Naga Chaitanya

దీనిపై నాగచైతన్య అనేక సార్లు పరోక్షంగా మా మధ్య ఏమి లేదని చెప్పుకొచ్చాడు. కానీ ఈరోజు సడన్ గా ఆయన ఈ సర్ప్రైజ్ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రాబొయ్యే రెండు నెలల్లోనే వీళ్లిద్దరి పెళ్లి కూడా జరగబోతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ సోషల్ మీడియా లో సమంత పై సానుభూతి చూపిస్తున్నారు. విడాకుల విషయం లో సమంత తప్పు ఏమాత్రం లేదని, నాగ చైతన్య తప్పు మాత్రమే ఉందని అంటున్నారు. ఎందుకంటే సమంత తో విడాకులు తీసుకున్న రోజే, సమంత వ్యక్తిగత సిబ్బంది శోభిత ని తిడుతూ పరోక్షంగా ఇంస్టాగ్రామ్ లో స్టోరీస్ పెట్టాడు.

Naga Chaitanya's Affair Began 1 Year After Divorce from Samantha; Dating Sobhita for 6 Months? - News18

- Advertisement -

ఆ తర్వాత కాసేపటికి ఆ స్టోరీ ని డిలీట్ చేసాడు. ఆరోజు ఎవ్వరికీ అర్థం కాలేదు అసలు విషయం ఇది అని. కాలం గడిచే కొద్దీ వీళ్ళ రిలేషన్ బయటపడడం, శోభిత వల్లనే సమంత, నాగ చైతన్య విడిపోవడం జరిగింది అనే క్లారిటీ వచ్చింది. నాగ చైతన్య సంతోషంగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖపడబోతున్నాడు. కానీ సమంత మాత్రం ఇప్పటికీ నాగ చైతన్య ని మర్చిపోలేక పోతుందని ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీలు చూస్తే అర్థం అయిపోతుంది. ఈ ఘటన తర్వాత పాపం ఆమె మానసిక పరిస్థితి ఏమిటో అని సమంత అభిమానులు కంగారు పడుతున్నారు.

Naga Chaitanya says 'involving third party' is worse when it comes to media speculation

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here