OTT Movies : థియేటర్స్ లో విడుదలైన సినిమాలకు ఓటీటీ లో అద్భుతమైన రెస్పాన్స్ రావడం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయ్యినప్పటికీ కూడా బిజినెస్ లో ఓటీటీ రైట్స్ కొనుగోలు అవ్వకపోతే సినిమా థియేట్రికల్ రిలీజ్ కూడా ఆగిపోయే పరిస్థితి. అంతే కాదు హీరోల రెమ్యూనరేషన్స్ కూడా ఓటీటీ రైట్స్ మీద ఆధారపడుంటాది. అలాగే థియేటర్స్ లో విడుదలైన ప్రతీ సినిమాకి ఓటీటీ లో మంచి రెస్పాన్స్ రావడం అనేది సులువు కాదు. కొన్ని సార్లు థియేటర్స్ లో ఫ్లాప్ గా నిల్చినవి ఓటీటీ లో సూపర్ హిట్ గా నిలవగా, సూపర్ హిట్ థియేట్రికల్ రన్ ని దక్కించుకున్న చిత్రాలు ఓటీటీ లో మిశ్రమ స్పందన దక్కించుకున్నాయి.
అలా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్స్ గా నిల్చి ఓటీటీ లో మిశ్రమ స్పందన దక్కించుకున్న సినిమాల గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. గత ఏడాది చివర్లో వచ్చిన రెబెల్ స్టార్ ప్రభాస్ ‘సలార్‘ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. కానీ ఓటీటీ లో ఈ చిత్రానికి ఊహించని రీతిలో మిశ్రమ స్పందన దక్కించుకొని, నెట్ ఫ్లిక్స్ సంస్థ కి నష్టాలను తెచ్చిపెట్టింది. టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ చిత్రానికి మిశ్రమ స్పందనే లభించింది. నష్టాలను రికవర్ చేసుకోవడం కోసం ఒక వర్కింగ్ డే రోజు సీరియల్స్ ని ఆపి మరీ ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేసారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది.
ఇక థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిల్చి ఓటీటీ లో మిశ్రమ స్పందన దక్కించుకున్న మరో చిత్రం భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. పర్వాలేదు అనే రేంజ్ లో రెస్పాన్స్ దక్కినప్పటికీ పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగినది కాదని మాత్రం చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత రవితేజ నటించిన ధమాకా, భగవంత్ కేసరి వంటి చిత్రాలకు కూడా అంతంత మాత్రం గానే వ్యూస్ వచ్చాయి. ఇకపోతే ఈ నెల 23 వ తారీఖున ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కల్కి అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. మరి ఈ చిత్రానికి థియేటర్స్ లో దక్కిన ఆదరణ దక్కుతుందా, లేదా సలార్ లాగానే మిశ్రమ స్పందన దక్కించుకుంటుందా అనేది చూడాలి.