అలా ఎక్కువగా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తూ వస్తుంది కీర్తి సురేష్. రీసెంట్ గా ఆమె ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలోని బుజ్జి క్యారక్టర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన బాయ్ ఫ్రెండ్ ఎవరో అందరికీ పరిచయం చేసింది. అసలు విషయానికి వస్తే కీర్తి సురేష్ టాలీవుడ్ లో అత్యంత సన్నిహితంగా ఉండే హీరోలలో ఒకరు న్యాచురల్ స్టార్ నాని. ఇతనితో కలిసి కీర్తి సురేష్ నేను లోకల్, దసరా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా నాని రేంజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.
ఈ సినిమాల షూటింగ్ సమయం లోనే కీర్తి సురేష్ , నాని మధ్య అత్యంత సాన్నిహిత్యం ఏర్పడిందని, నాని కుటుంబం లో ఒక సభ్యురాలిగా కీర్తి సురేష్ మారిపోయిందని అంటుంటారు. అయితే ఆమె మాట్లాడుతూ ‘ నాని కొడుకు జున్ను అంటే నాకు చాలా ఇష్టం. అతను నా బాయ్ ఫ్రెండ్. నా పుట్టినరోజు నాడు జున్ను చెప్పిన శుభాకాంక్షలు స్టైల్ చూస్తే ఇప్పటికీ నాకు నవ్వు వస్తుంది. కిట్టి అత్త హ్యాపీ బర్త్ డే అంటూ వచ్చీ రాని మాటలతో వాడు పెట్టిన వాయిస్ మెసేజిలు ఎంతో క్యూట్ గా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.