Tamil Film Producers తమిళ సినిమా ఇండస్ట్రీ పూర్తిగా సంక్షోభం లో పడిందా..?, నిర్మాతలు హీరోల వైఖరి ని భరించలేకపోతున్నారా? అంటే అవుననే అంటుంది కోలీవుడ్. రీసెంట్ గా తమిళ సినిమాలకు సంబంధించిన నిర్మాతలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ తీసుకొని సినిమాలు పూర్తి చెయ్యని నటీనటుల పై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 15 నుండి కొత్త సినిమాల షూటింగ్స్ ని నిలిపివేయాలని నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న షూటింగ్స్ అన్నిటిని అక్టోబర్ 31 వ తేదీలోపు పూర్తి చెయ్యాలని నటీనటులను నిర్మాతల మండలి ఆదేశించింది.
ఒక సినిమా పూర్తి అయిన తర్వాతే మరో కొత్త సినిమాకి ఇక నుండి కాల్ షీట్స్ ఇవ్వాలని, అలాగే స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో విడుదలైన 8 వారాల తర్వాతనే ఓటీటీ లో విడుదల చెయ్యాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ఒక స్టార్ హీరో ఒకేసారి రెండు , మూడు సినిమాలు చేయరాదని, దానివల్ల నిర్మాతలకు తలకు మించిన భారం మిగులుతుందని నిర్మాతలు తమ ఆవేదనని వ్యక్తపరిచారు. ఈమేరకు తమిళ స్టార్ హీరో ధనుష్ పై నిర్మాతల మండలి చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అడ్వాన్స్ తీసుకొని సినిమాలు పూర్తి చెయ్యడం లేదని, ఇక నుండి ఏ నిర్మాత అయినా ధనుష్ కాల్ షీట్స్ తీసుకోవాలంటే ముందుగా మా అనుమతి తీసుకోవాలి అంటూ నిర్మాతల మండలి చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.
రీసెంట్ గానే ధనుష్ హీరో గా , దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేసిన ‘రాయన్’ చిత్రం థియేటర్స్ లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఫలితాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత ధనుష్ తమిళం లో రెండు సినిమాలు, హిందీ లో ఒక సినిమా, అలాగే తెలుగు నాగార్జున తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వం లో కుభేర వంటి చిత్రాలలో హీరో గా నటిస్తున్నాడు. కేవలం ధనుష్ కి మాత్రమే కాదు, రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్ వంటి సూపర్ స్టార్స్ కూడా ఇక నుండి ఒకేసారి రెండు మూడు సినిమాల్లో నటించేందుకు వీలు లేదట. ఇలాంటి కఠినమైన చర్యలు మన టాలీవుడ్ నిర్మాతలు కూడా తీసుకుంటే బాగుండును అని విశ్లేషకులు అంటున్నారు.