Rajasaab Movie Teaser : ‘రాజా సాబ్’ టీజర్ అదిరిపోయింది..పాత ప్రభాస్ ని చూసి మురిసిపోతున్న అభిమానులు!

- Advertisement -

Rajasaab Movie Teaser రెబెల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత తన వింటేజ్ మార్క్ లో ఉండే కమర్షియల్ మూవీ , డైరెక్టర్ మారుతీ తో చేస్తున్నాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ‘ది రాజా సాబ్’ అనే టైటిల్ పెట్టి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. అయితే కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో విడుదలైంది. ఈ వీడియో లో ప్రభాస్ ఎంతో స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చి బండి అడ్డం మీద తనని తాను చూసుకొని పూలు చల్లుకుంటాడు. ఆ తర్వాత వీడియో చివర్లో హారర్ కామెడీ అని పడి, ఏప్రిల్ 10 వ తారీఖున విడుదల అని పడుతుంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. గతం లో ఈయన పవన్ కళ్యాణ్ తో బ్రో చిత్రం తీసాడు.

Rajasaab Movie Teaser
Rajasaab Movie Teaser

ముందుగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరి ఊహించని విధంగా ఏప్రిల్ 10 వ తారీఖున విడుదల అవుతుందని అధికారిక ప్రకటన చేసారు. ఇదే టైం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తో పాటుగా పుష్ప 2 కూడా ఇదే పీరియడ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇలా టాలీవుడ్ క్రేజీ హీరోలందరూ ఒకేసారి వరుసపెట్టి సినిమాలు విడుదల చెయ్యబోతున్నారన్నమాట. గతం లో 2021 వ సంవత్సరం లో ఇలాగే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఒకరి తర్వాత ఒకరు బాక్స్ ఆఫీస్ దండయాత్ర చేసారు. మళ్ళీ ఇన్నాళ్లకు అదే పరిస్థితి రాబోతుంది.

ఈ బాక్స్ ఆఫీస్ పోరు లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. ఇది ఇలా ఉండగా ప్రభాస్ రాజా సాబ్ చిత్రం లో హీరోయిన్స్ గా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ఇలా హారర్ కామెడీ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. చూడాలి మరి డైరెక్టర్ మారుతి చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది. ఈ చిత్రం కూడా తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here