Tharun Sudhir : కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ దర్శన్ , పవిత్రల కేసు.. ఓ అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ను ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ కేసు విచారణలో పోలీసులకు కొత్త విషయాలు ఎదురవుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం కేసు విచారణ సాగుతుండగా దర్శన్ తో పాటు అరెస్ట్ అయిన పలువురు జైల్లోనే ఉన్నారు. ఈ హత్య కేసులో ఆధారాలు అన్ని దర్శన్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ ఈ విషయం పై పలువురు దర్శన్ ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు..
ఇప్పటికే చాలా మంది అభిమానులు జైలుకు వెళ్లి దర్శన్ బాగోగులను తెలుసుకుంటున్నారు. తాజాగా కన్నడ డైరెక్టర్ తరుణ్ సుధీర్ జైల్లో దర్శన్ ని కలిసాడు. వీరిద్దరి కాంబోలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి.. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ఆగస్టులో తరుణ్ పెళ్లి ఉండటంతో దర్శన్ ని పెళ్ళికి పిలవడానికి జైలుకి వెళ్ళాడు. జైల్లో దర్శన్ ని కలిసి తరుణ్ తన పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించాడు. త్వరలోనే నిరపరాధిగా బయటకు వస్తావని ఓదార్చాడు.. ఆయన జైలుకు వెళ్లిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
జైల్లో దర్శన్ ను కలిసిన తర్వాత డైరెక్టర్ మీడియాతో మాట్లాడారు.. దర్శన్ ఎప్పట్లాగే నవ్వుతూ పలకరించాడు. అయితే ఆయన్ని చూస్తుంటే ఆరోగ్యం బాగోలేదు అనిపిస్తుంది. అయన అరెస్ట్ తర్వాత మేమంతా ఏదో కోల్పోయాము అనిపిస్తుంది. దర్శన్ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు.. త్వరలోనే వస్తావని ధైర్యం చెప్పినట్లు ఆయన అన్నారు. నాకు పెళ్లి కుదిరిన విషయం దర్శన్ కు తెలుసు. అందుకే పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళాను . నా పెళ్ళికి ఆయన ఖచ్చితంగా వస్తారని అయన అన్నాడు అది ఇప్పుడు సంచలనంగా మారింది..