Kalki AD 2898 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు హిట్ కొట్టినా చాలా బలంగా హిట్ కొడుతాడు, ఆయన కొట్టినప్పుడు క్రియేట్ అయినా రికార్డ్స్ ని అంత తేలికగా ఎవ్వరూ ముట్టుకోలేరు. అలా పవన్ కళ్యాణ్ అప్పట్లో ఒక సాధారణ అర్బన్ లవ్ స్టోరీ అయిన ఖుషి తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఆరోజుల్లోనే 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టాడు. ఈ చిత్రానికి సంబంధించిన రికార్డ్స్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆ రోజుల్లో ఆ చిత్రం ఏ స్థాయి ప్రభంజనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే రీసెంట్ గా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి ని సృష్టించి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఖుషి రికార్డుని ఒక ప్రాంతం లో అందుకోవడంలో విఫలం అయ్యిందట. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని పాపులర్ సెంటర్స్ లో ఒకటైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఖుషి చిత్రం దాదాపుగా కోటి 56 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం తర్వాత అదే పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం కోటి 17 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇప్పుడు కల్కి చిత్రం తొలిప్రేమ రికార్డుని బద్దలు కొట్టి కోటి 32 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో ఖుషి గ్రాస్ రికార్డుని కొల్లగొట్టడం దాదాపుగా అసాధ్యమే.
ఆరోజుల్లో టికెట్ రేట్స్ కేవలం 10 రూపాయిలు కూడా ఉండేది కాదు. అలాంటి రేట్స్ తో ఈ చిత్రం ఆ స్థాయి అనితర సాధ్యమైన రికార్డుని నెలకొల్పింది అంటే నైజాం ప్రాంతం లో పవన్ కళ్యాణ్ క్రేజ్, స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ రికార్డుని ఓజీ చిత్రంతో మరోసారి పవన్ కల్యాణే బద్దలు కొడతాడని అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు.ప్రస్తుతం రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్, త్వరలోనే సగానికి పైగా పూర్తి చేసిన హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను పూర్తి చెయ్యనున్నారు. వీటిల్లో ఏది ముందు విడుదల అవ్వబోతుందో చూడాలి.