Brahmanandam టాలీవుడ్ లో లెజండరీ కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో మన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ని గుర్తు చేసుకోకుండా ఉండలేము. కంటెంట్ లేని సన్నివేశాల్లో తమ హావభావాలతో హాస్యం రప్పించే గొప్ప టాలెంట్ కేవలం కొంతమంది అరుదైన కమెడియన్స్ లో మాత్రమే ఉంటుంది. ఆ అరుదైన కమెడియన్స్ లో ఒకరు ఆయన. ఆయన డైలాగ్ వింటేనే మనకి తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది. అలాంటి గొప్ప కమెడియన్ ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. మళ్ళీ ఇలాంటి కమెడియన్స్ ని మనం చూడలేము. సినిమాల్లోకి వచ్చే ముందు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎన్నో కమర్షియల్ యాడ్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చేవాడు.
టెలివిజన్ లో ప్రసారమయ్యే ఆనందో బ్రహ్మ అనే చిత్రం ద్వారా పాపులారిటీ ని సంపాదించుకున్న ఆయన, ఆ సీరియల్ తర్వాత ఆయనకీ సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఒక్కడు, వర్షం , నువ్వు నేను ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటనకు గాను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అనతి కాలం లోనే పెద్ద స్టార్ కమెడియన్ గా మారాడు. ఇకపోతే ధర్మవరపు సుబ్రహ్మణ్యం కి ఇండస్ట్రీ లో అత్యంత ఆప్త మిత్రుడు బ్రహ్మానందం.
నేడు బ్రహ్మానందం ఒక ఈవెంట్ లో ధర్మవరపు గురించి మాట్లాడుతూ ధర్మవరపు గారికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఒకరోజు ఆయన ఇంటికి వెళ్లి చూడాలని అనుకున్నాను. కానీ ఆయన నన్ను రావొద్దు అని ఆపేసారు. ఒకప్పుడు ఉన్నట్టు నేను ఇప్పుడు లేనురా, నన్ను చూసి నువ్వు తట్టుకోలేవు, దయచేసి రావొద్దు అని బ్రహ్మానందం తో అనేవాడట. ఏమి పర్వాలేదు నేను వస్తాను అని బ్రహ్మానందం మొండికేస్తే , సరే డిసెంబర్ లో ఇంటికి రా, అప్పటికి నేను బాగా అయిపోతాను, మునిపటిలా ఉంటాను అని చెప్పాడట. చివరికి ఆ డిసెంబర్ లోపే ధర్మవరపు సుబ్రహ్మణ్యం అశ్వతతతో చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ బ్రహ్మానందం ఆయన్ని తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.