Venu swamy : వేణు స్వామి మహా ప్రసాదాన్ని స్వీకరించిన డైరెక్టర్.. ఆ యాంకర్ ను చూశారా?

- Advertisement -

Venu swamy ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే..  తన జ్యోతిష్యంతో ట్రోలర్స్‌కి ఎప్పటికప్పుడు హాట్ కేక్ లాంటి కంటెంట్ ఇస్తుంటాడు కానీ.. అతనికున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. అతని రేంజ్‌లేరు. సెలబ్రిటీలంతా అతనితో పూజలు చేయించుకోవడానికి క్యూలు కడుతూనే ఉంటారు. అతని అపాయింట్‌మెంట్ దొరకడం అంటూ మామూలు విషయం కాదు.. ఇప్పటివరకు ఎక్కువగా హీరోయిన్లకు అయిన ప్రత్యేక పూజలు చేశారు.. తాజాగా ఓ ప్రముఖ డైరెక్టర్ ఆయనతో పూజలు చేయించుకున్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Venu swamy
Venu swamy

గుడిలో ప్రసాదం అంటే పులిహోర, దద్దోజనం, లడ్డూ, వడలు లాంటివి ఇస్తుంటారు. ఇక ఇంట్లో చేసుకునే పూజల్లో వీటితో పాటు అదనంగా గారెలు, బూరెలు, పూర్ణాలు ఇలా చాలారకాల పిండి వంటల్ని ప్రసాదంగా ఇస్తారు.. కానీ వేణుస్వామి రూటే సపరేట్.. ప్రసాదంగా నాన్ వెజ్ లో రకరకాల వంటలను పెడుతుంటాడు.. ఇకపూజలు కూడా చాలా వింతగా ఉంటాయి.. అయన పూజల వీడియోలు గతంలో చాలానే వైరల్ అయ్యాయి..అతని జ్యోతిష్యంపై ఎన్ని విమర్శలు వచ్చినా.. వివాదాలు నడిచినా సెలబ్రిటీలంతా ఆయనతో పూజలు చేయించుకోవడానికే ఎగబడుతుంటారు..

తాజాగా ప్రముఖ డైరెక్టర్, నటుడు సముద్రఖని కూడా ఆయనతో పూజలు చేయించుకున్నట్లు తెలుస్తుంది.. వేణు స్వామి మహా ప్రసాదంగా అందించే మటన్ కర్రీ, ఫిష్ కర్రీలను కూడా స్వీకరించారు.. కామాఖ్య దేవి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయించినట్లు తెలుస్తుంది.. ఆ పూజ అనంతరం డైరెక్టర్ కు చేపల కూర మరియు మటన్ కూరను ప్రసాదంగా తీసుకురావడం జరిగిందంటు ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఓ యాంకర్ కూడా ఉన్నాడు.. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది..

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here