Guess The Actress : టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా రాణించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అప్పట్లో రంభ, లయ అలాగే నేటి తరం లో శ్రీలీల వంటి తెలుగు అమ్మాయిలు రాణించారు కానీ, అత్యధిక శాతం ఇతర రాష్ట్రానికి చెందిన అమ్మాయిలే మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా ఇన్ని రోజులు కొనసాగుతూ వచ్చారు. కానీ అందం, అభినయం, అద్భుత్త్వమైన నటన, డ్యాన్స్ ఉన్న తెలిసిన తెలుగు హీరోయిన్లు మాత్రం సినిమాల్లో అవకాశాలు లేక, వయసు మించిపోయి అంటీలుగా మారి గుర్తుపట్టలేని విధంగా తయారయ్యారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు గురించే నేడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ క్రింద కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా?, పక్కంటి అమ్మాయి లాంటి పాత్రలు ఈమె ఎన్నో చేసింది.చూడగానే మన ఇంటి అమ్మాయే కదా అనిపించేంత చక్కటి సహజసిద్ధమైన నటన ఈ అమ్మాయి సొంతం.

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు నికిత తుక్రల్. ఈమె 1995 వ సంవత్సరం లో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఘటోత్కచుడు అనే చిత్రం లో బాలనటిగా నటించింది. ఈ సినిమా మొత్తం ఆమె చుట్టూ తిరిగే సంగతి మన అందరికీ తెలిసిందే. చిన్నతనం లోనే చక్కటి అభినయం కనబర్చి మంచి మార్కులు కొట్టేసిన నిఖిత పెద్దైన తర్వాత ఆర్యన్ రాజేష్ హీరో గా నటించిన ‘హాయ్’ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైంది. ఆ తర్వాత కల్యాణ రాముడు, ఖుషి ఖుషిగా, సంబరం, ఏవండోయ్ శ్రీవారు, డాన్ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళం, తమిళ చిత్రాలలో కూడా ఈమె నటించింది. 2018 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె, ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. మరో విశేషం ఏమిటంటే ఈమె కన్నడ లో టెలికాస్ట్ అయినా బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని రన్నర్ గా నిల్చింది. అయితే ఇంత సుదీర్ఘ ప్రస్థానం ఉన్నప్పటికీ కూడా నిఖిత కి మిగిలిన హీరోయిన్స్ కి దక్కిన పాపులారిటీ లో పావు శాతం కూడా దక్కకపోవడం దురదృష్టకరం. చాలా కాలం తర్వాత ఆమె ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యి కనిపించగా, ఇలా మారిపోయిందేంటి అని ఆశ్చర్యపోతున్నారు నెటిజెన్స్.