Kalki 2898 AD : ‘కల్కి’ క్లైమాక్స్ లో కమల్ హాసన్ డైలాగ్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. డీకోడ్ చేస్తే మెంటలెక్కిపోతారు!

- Advertisement -

Kalki 2898 AD :  రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన కల్కి చిత్రం ఇటీవలే విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల వైపు పరుగులు తీస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వీకెండ్ లోనే ఈ ప్రతిష్టాత్మక క్లబ్ లోకి ఈ సినిమా చేరనుంది. ఈ చిత్రానికి ముందు విడుదలైన ప్రభాస్ సలార్ చిత్రానికి హిట్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా ఎబోవ్ యావరేజి గా నిలవగా, కల్కి చిత్రం మాత్రం ప్రభాస్ కెరీర్ లో మరో క్లీన్ హిట్ గా నిల్చింది. కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కి సంపూర్ణమైన హిట్ గా నిల్చిన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాలోని కొన్ని పాత్రలు ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఆ పాత్రల్లో కమల్ హాసన్ పోషించిన సుప్రీమ్ యాస్కిన్ పాత్ర గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

Kalki 2898 AD
Kalki 2898 AD

సుప్రీమ్ యాస్కీన్ ‘కలి’ పురుషుడు అనే విషయం చూసే ఆడియన్స్ అందరికీ అర్థం అయ్యింది. ఈ చిత్రం లో కమల్ హాసన్ కనిపించింది చాలా తక్కువ సమయమే అయ్యినప్పటికీ చూసే ఆడియన్స్ కి ఎంతో పవర్ ఫుల్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కేవలం మూడు నిమిషాలు మాత్రమే కనిపించిన కమల్ హాసన్ మళ్ళీ క్లైమాక్స్ లో కనిపిస్తాడు. క్లైమాక్స్ లో ఆయన తన రూపాన్ని పొందిన తర్వాత అర్జునుడి గాండీవం పైకి ఎత్తుతాడు. సుమతి కడుపు నుండి సేకరించిన కల్కి భగవానుడి సీరం ఒక్క డ్రాప్ తన శరీరంలోకి ఎక్కించుకునేలోపు ఎంతో శక్తివంతుడిగా మారిపోతాడు సుప్రీమ్ యాస్కిన్. సామాన్య మానవులు పైకి ఎత్తలేని గాండీవం ని క్లైమాక్స్ లో కేవలం ఒకే ఒక్క చేతితో పైకి ఎత్తుతూ ‘జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి..భూకంపం సృష్టిస్తాను’ అంటాడు.

Kalki 2898 AD character guide – Who is Kamal Haasan's Supreme Yaskin?

- Advertisement -

ఈ సన్నివేశం తర్వాత సినిమా ముగుస్తుంది. ఇంతకీ ఈ డైలాగ్ ని సుప్రీమ్ యాస్కిన్ ఎందుకు పలికాడు అనే విషయాన్నీ పరిశీలిస్తే మహాభారతం లో అర్జునుడు శ్రీకృష్ణుడు సారధి గా వ్యవహరిస్తున్న రథం లో కూర్చొని శత్రువుల మీద విలయ తాండవం చేస్తాడు. ఇప్పుడు అదే రథం మీద సుప్రీమ్ యాస్కీన్ కూర్చొని, గాండీవం తో భూగోళంపై ప్రకంపనలు పుట్టించి, సుమతి కడుపులో పెరుగుతున్న కల్కి భగవానుడిని చంపేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ఆ డైలాగ్ వెనుక ఇంత అర్థం ఉందట. పార్ట్ 1 లో కేవలం 7 నిమిషాలు కనిపించిన కమల్ హాసన్, రెండవ భాగం లో సినిమా మొత్తం కనిపించనున్నాడు. ఈ భాగం లో సుప్రీమ్ యాస్కీన్ ప్రపంచం లో ఉన్న అందరికంటే శక్తివంతుడిగా కనిపించబోతున్నాడు. ఇతనితో పోరాడేందుకు పునర్జన్మ ఎత్తిన కర్ణుడు, అర్జునుడితో తో పాటు అశ్వథామ మరియు ఇతర చిరంజీవులు కూడా వస్తారట.

Did Kamal Haasan's Supreme Yaskin from Kalki 2898 AD almost look like this? Concept artist shares rejected look - Hindustan Times

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here