Pawan kalyan – Supriya : అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మళ్లీ కలిశారు.. ఫొటోస్ వైరల్..

- Advertisement -

Pawan kalyan – Supriya : సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు బాగా పాపులర్ అయ్యాక రాజకీయాల్లో కూడా పాగా వేసేందుకు రెడీ అవుతున్నారు.. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్లు రాజకీయాల్లోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు.. కొందరు కీలక పదవుల్లో కూడా ఉన్నారు.. అందులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానుల మనసు దోచుకున్న ఆయన ప్రస్తుతం ప్రజా సేవ చేస్తూ ప్రజల ఆధరాభిమానాలను అందుకున్నాడు..

Pawan kalyan - Supriya
Pawan kalyan – Supriya

మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 28 ఏళ్లు పూర్తి అయింది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.. ఆయన చేసిన మొదటి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ 28ఏళ్లుగా స్టార్ హీరోగా టాలీవుడ్ లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా పలు సినిమాలు చేశారు. అయితే సుప్రియ మాత్రం తన ఫస్ట్ సినిమా సక్సెస్ టాక్ అందుకోక పోవడంతో ఆన్ స్క్రీన్ కు దూరంగా ఉంది.. ప్రస్తుతం నిర్మాతగా వ్యవహారిస్తూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..

- Advertisement -

ఇదిలా ఉండగా తాజాగా సినిమా ఇండస్ట్రీలోని సమస్యలను పరిష్కరించడానికి టాలీవుడ్ నిర్మాతలంతా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని కలిశారు. ఆయనకు తమ సమస్యలు చెప్పుకున్నారు. నిర్మాతల మండలి సభ్యుల్లో భాగంగానే పవన్ కళ్యాణ్ తో మొదట స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ సుప్రీత కూడా పవన్ కళ్యాణ్ ను కలిసింది.. ఈ సందర్బంగా సుప్రీతతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here