Meenakshi Chowdary : కమెడీయన్ తో మీనాక్షి చౌదరి రొమాన్స్ .. అయ్యో ఏ పరిస్థితి వచ్చిందంటూ ఫ్యాన్స్ షాక్

- Advertisement -

Meenakshi Chowdary : మీనాక్షి చౌదరి ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచట వాహనముల నిలుపరాదు’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ సినిమాలో తన నటన, అందంటో ఆకట్టుకుంది. తర్వాత ఇండస్ట్రీలో తనకు ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాలో నటించినప్పటికీ ముద్దుగుమ్మకు పెద్దగా క్రేజ్ రాలేదు. మెల్లమెల్లగా మీనాక్షి చౌదరి ఒక్కొక్క స్టార్ హీరోల సినిమాల్లో నటించడానికి అవకాశాలు దక్కించుకుంటుంది. ఆ మధ్య మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించింది. కానీ ఆ సినిమాలో నటించినందుకు సోషల్ మీడియాలో బాగా ట్రోలింగుకు గురైంది.

Meenakshi Chowdary
Meenakshi Chowdary

సినిమాలో తనది పెద్దగా చెప్పుకోతగ్గ రోల్ కానప్పటికీ మహేష్ బాబు పుణ్యమాంటూ కోలీవుడ్లో ఆఫర్స్ అందుకునే స్థాయికి వెళ్లిపోయింది. విజయ్ దళపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న గోట్ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో ఛాన్స్ అందుకుంది మీనాక్షి చౌదరి అంటూ వార్తలు వస్తున్నారు. స్టార్ కమెడియన్ సంతానం చేస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించనుందట. అమ్మడు అందాలు బాగానే ఆరబోసినా అవకాశాలు ఇచ్చే వాళ్లు మాత్రం కరువయ్యారు.

Santhanam At The ‘A1’ Press Meet

సంతానం హీరోగా చేస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నారట. ఈ సినిమాను కోలీవుడ్ హీరో ఆర్య నిర్మిస్తూ ఉండడం .. ప్రేమానంద్ దర్శకత్వం వహించడం ఇంట్రెస్టింగ్ గా మారింది . ఒకపక్క స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే.. మరొక పక్క కమెడియన్లతో కూడా ఈ విధంగా ఆమె కెరీర్లో బిజీ కావడం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యపరుస్తుంది . కంటెంట్ బాగా నచ్చే సంతానంతో నటించేందుకు మీనాక్షి చౌదరి ఓకే చెప్పిందన్న వార్త వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here