Prabhas : ప్రభాస్ ను అండర్ వేర్ లేకుండా చూపించనున్న సందీప్ రెడ్డి వంగా.. పెద్ద సాహసమే

- Advertisement -

Prabhas : ప్రస్తుతం ప్రభాస్ అంటే తెలియని వారుండరు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వారికి బాగా కోపం తెప్పించే వార్త ఒకటి ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. ప్రభాస్ అంటే బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించిన ఒక పాన్ ఇండియా హీరో. ఆ సినిమాలో నటించి తన తలరాతను తానే మార్చేసుకున్న రెబల్ హీరో.. మరి అలాంటి హీరో చేత బోల్డ్ సీన్ చేయించాలని ఓ డైరెక్టర్ అనుకుంటున్నాడట. ప్రభాస్ ను ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ అయినా చాలావరకు ట్రెడిషనల్ గానే చూపించాలి అనుకుంటారు. కానీ ఆయన మాత్రం ఈ సారి ప్రభాస్ ను తన సినిమాలో అండర్ వేర్ కూడా లేకుండా న్యూడ్ గా చూపించాలని ఫిక్స్ అయ్యాడట.

ఆయన మరెవరో కాదు అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డివంగా. ఆయన ఎవ్వరికీ తలవంచడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన అనుకున్న కథను అనుకున్న విధంగానే తెరకెక్కిస్తాడు. ముందుగానే ఆ విషయాలను సదరు హీరో హీరోయిన్లకి చెప్తాడు. అర్జున్ రెడ్డి .. యానిమల్ సినిమా చూసిన తర్వాత ఏ హీరో హీరోయిన్ కూడా సందీప్ రెడ్డి వంగాపై నెగిటివ్ గా మాట్లాడడానికి.. తనను వేలెత్తి చూపించడానికి సాహసం చేయరు. ఆయన రాసుకున్న కథలు నిజ జీవితానికి అంత దగ్గరగా ఉంటాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా.. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -


అయితే ఈ సినిమాలో కూడా అర్జున్ రెడ్డి – యానిమల్ సినిమాలో ఉన్న లాగానే ఒక బోల్డ్ సీన్ ఉంటుందట. రొమాంటిక్ సీన్ అని చెప్పలేము కానీ ఒకానొక సందర్భంలో ప్రభాస్ ఒంటి మీద బట్టలు లేకుండా ఒక ఐదు సెకండ్ల పాటు కనిపించబోతున్నాడట. అయితే ప్రైవేట్ పార్ట్స్ బ్లర్ చేసి చూపించడానికి పెద్ద సాహసమే చేస్తున్నాడు సందీప్ రెడ్డివంగా అన్న వార్త వైరల్ అవుతుంది. నిజానికి యానిమల్ సినిమాలో రన్ బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోని కూడా ఓ సీన్లో అలా చూపించే సాహసం చేశాడు సందీప్ . అయితే ప్రభాస్ ని కూడా ముందుగానే ఈ విషయం కారణంగా రిక్వెస్ట్ చేశారట. ఆశ్చర్యం ఏంటంటే కథ నచ్చిన ప్రభాస్ అలా నటించడానికి ఒప్పేసుకున్నారట. ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here