Ram Charan : టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్‌గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్, ఉపాసనలకు టాలీవుడ్‌లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. మొదట్లో ఉపాసనను విమర్శించిన వారే ప్రస్తుతం ఆమె పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక గతేడాది మెగా అభిమానులకు శుభవార్త అందించారు ఉపాసన. మెగా కోడలు తల్లిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులు అయ్యారు.
ఉపాసన ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీంకార అని నామకారణం చేశారు. క్లీంకార రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే క్లీంకారను మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి చూపించలేదు. దీంతో క్లీంకారను చూడటానికి మెగా అభిమానులు కూడా చాలా ఉత్సుకతను చూపిస్తున్నారు. రామ్ చరణ్ దంపతులు ఇప్పటివరకు క్లీంకార ఫేస్ ని రివీల్ చేయలేదు. మెగా అభిమానులంతా మెగా ప్రిన్స్ ఫేస్ ని చూడడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే పలుమార్లు క్లీంకార ఫోటోలు బయటకు వచ్చినా తన ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు చరణ్, ఉపాసన. తాజాగా ఫాదర్స్ డే స్పెషల్ ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ నేషనల్ మీడియాకు ప్రత్యేకంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ నేడు ఫాదర్స్ డే సందర్భంగా పబ్లిష్ అయింది. ఫాదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ కావడంతో క్లీంకార తో దిగిన ఫొటోని కూడా పబ్లిష్ చేశారు.
దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. మొదటిసారి రామ్ చరణ్ సింగిల్ గా క్లీంకారాతో కలిసి దిగిన ఫోటో బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఇక రామ్ చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి, కూతురు గురించి, తండ్రి అయ్యాక తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనేది తెలిపారు.