టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కున అందరికీ ప్రభాస్ పేరే వినిపిస్తుంది.. వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్న అందరికీ వస్తుంది.. అదే ప్రశ్నను ప్రభాస్ ను అడిగితే మాత్రం అదిగో ఇదిగో అంటూ దాటవేస్తున్నాడు.. తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి డైరెక్టర్ రాజమౌళి సంచలన విషయాలను బయట పెట్టాడు.. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇన్ని ఏళ్ళు వచ్చిన ప్రభాస్ పెళ్లి గురించి ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. పాన్ ఇండియా స్టార్ హీరో అయి ఉండి.. ప్రభాస్ ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. కానీ ప్రభాస్ సినిమాలతో ముడిపెడుతూ తప్పించుకుంటున్నాడు.. అయితే రాజమౌళి, ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదనే విషయం పై రాజమౌళి సంచలన విషయాలను బయటపెట్టాడు..
జక్కన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ కు బద్ధకం చాలా ఎక్కువ.. పెళ్లి చేసుకోవాలన్నా కూడా ప్రభాస్ కి బద్ధకమే. ఇప్పటికిప్పుడు ఒక అమ్మాయిని చూసి.. ఆమెను కలిసి ప్రేమించి పెళ్లికి ఒప్పించాలంటే చాలా పని అందుకే డార్లింగ్ పెళ్లి అంటే వద్దు అంటున్నాడు.. రాజమౌళి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వీరి సినిమాల విషయానికొస్తే.. ఇద్దరు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు..