Jyothi Rai : జగతి మేడం అలియాస్ జ్యోతిరాయ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొన్ని నెలలుగా ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న పేరు. జ్యోతి రాయ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరీ ముఖ్యంగా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన జ్యోతి పద్ధతికి పట్టు చీర కట్టినట్లు ఉండేది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదు. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేయడం మొదలు పెట్టింది. దీనితో ఎంతో పద్ధతిగా ఉండే జగతి మేడంను చూసి జనాలు వామ్మో ఏంటి ఇంత బరితెగింపు అనే రేంజ్ లో ట్రోల్ చేశారు.
ఇటీవల కాలంలో తన మొదటి భర్తను వదిలి పెట్టి సుకు పూర్వ రాజ్ అనే డైరెక్టర్ తో ప్రేమాయణం కొనసాగించింది. తనను పెళ్లి కూడా చేసేసుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆమె మొదటి భర్తతో ఒక బిడ్డను కూడా కనింది. దీంతో సిగ్గు లేదా మళ్ళీ ప్రేమ ఏంటి అంటూ జనాలు తిట్టిపోశారు. అయినా సరే వాటిని పెద్దగా పట్టించుకోలేదు జగతి మేడం.. తాజాగా ఆమె ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అది కూడా తన రెండో భర్త సుకు పూర్వ రాజ్ దర్శకత్వంలోనే. ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న జ్యోతి రాయ్ కు ఎక్స్ పోజింగ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
దీంతో చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది . “సినిమా ఇండస్ట్రీలో ఉన్నాక ఏ పాత్రకు తగ్గ న్యాయం ఆ పాత్రకు చేయాల్సిందే. ట్రెడిషనల్ గా కనిపించేటప్పుడు అలాగే కనిపించాలి.. మోడరన్ లుక్స్ లో మెరిసేటప్పుడు మోడరన్ గా ఆకట్టుకోవాలి .. ఎవరో నన్ను ట్రోల్ చేస్తున్నారు అని .. నా వృత్తిని నేను వదులుకోలేను కదా..? ఎవరు ఏమనుకున్నా సరే నా సినిమాలు నావి.. నా కెరియర్ నాది.. నా ఇష్టపూర్వకంగానే నేను సినిమాలో నటిస్తున్నాను.. సినిమాల కోసం ఏమైనా చేస్తాను ” అంటూ చాలా ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది. కొంతమంది జగతి మేడం ఇచ్చిన సమాధానం కరెక్ట్ అంటుంటే మరి కొంతమంది పూర్తిగా సినిమా మాయలో పడిపోయింది ఈ మేడం అంటూ తిట్టిపోస్తున్నారు.