Vijay Devarakonda : షాకింగ్.. పేరు మార్చుకోబోతున్న విజయ్ దేవరకొండ..ఎందుకంటే ?

- Advertisement -

Vijay Devarakonda : హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కెరీర్ మొదట్లో చిన్నా చితకా పాత్రలు చేసిన ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. తెలంగాణ యాసతో.. అద్భుతమైన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఆయన కెరీర్ ను అర్జున్ రెడ్డి సినిమా ఓ మలుపు తిప్పేసింది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. తర్వాత వరుస అవకాశాలు ఆయన తలుపు తట్టాయి. విజయ్ దేవర కొండ అంటే యూత్‌లో ఓ కొత్త క్రేజ్ ఏర్పడింది.

విజయ్ దేవరకొండ అంటే యువతుల్లో వచ్చే వైబ్రేషన్ వేరుగా ఉంటుంది. ఈ క్రమంలోనే వారికి ఓ బిగ్ షాక్ తగలనుంది. అతి త్వరలో విజయ్ దేవరకొండ తన పేరు మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గీతా గోవిందం తప్పితే తర్వాత నుంచి ఆయనుక వరుస ఫ్లాప్స్ ఎక్కువగా వస్తున్నాయి. దీంతో విజయ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, గీతా గోవిదం తప్పితే తన కెరీర్లో వావ్ అనిపించే సూపర్ హిట్ సినిమాలు రాలేదు. ట్యాక్సీవాలా సినిమా ఫర్వాలేదు అనిపించింది. ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

- Advertisement -

రీసెంట్ గా వచ్చిన ఖుషి సినిమా కూడా యావరేజ్ గా ఆడింది. దీంతో మన రౌడీ హీరో అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. సినిమాలు ఫ్లాప్స్ కావడంతో విజయ్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడట. దీంతో తన తల్లి ఆయన జాతకం చూయించినట్లు తెలుస్తోంది. దీంతో జ్యోతిష్యుడు, విజయ్ పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని సూచించాడట. ఈ నేపథ్యంలోనే తాను పేరు మార్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తన తల్లి అంటే విజయ్‌కు చాలా ఇష్టం. ఆమె ఆనందంగా ఉంటుందంటూ చాలు తను ఆమె కోసం ఎలాంటి పని అయినా చేస్తాడు. అలాంటి వ్యక్తి, ఆమె పేరు మార్చుకోమని కోరడంతో కాదనలేక ఓకే చెప్పాడంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అమెరికా టూర్ లో ఉన్నారు. ఈ టూర్ కు విజయ్ తండ్రి గోవర్థన్, తల్లి మాధవి, సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా వెళ్లారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here