Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఓ పక్క కల్కి సినిమా రిలీజ్ దగ్గరవుతుంటే.. మరో పక్క మారుతీతో రాజాసాబ్, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ వంటి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ‘సలార్ పార్ట్ 2’ కూడా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకైతే ఇది ఇంకా పట్టాలెక్కలేదని సమాచారం. అయితే.. ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్న ప్రభాస్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో ఒకడిగా ఉన్నాడు. ఎలా లేదు అన్నా.. ఒక్క సినిమాకు వచ్చి ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ రూ. 100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్. ఇక ప్రభాస్‌కు ఆస్తుల విలువ కూడా ఎక్కువే. ఇతనకి ఖరీదైన ఫాంహౌస్‌లు, బంగ్లాలు, విదేశాల్లో లగ్జరీ ఇళ్లు, లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి.
కానీ, 44 సంవత్సరాలు కావొస్తున్నా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లిపై ప్రస్తావన వచ్చిన ప్రతిసారి.. ఏదో రకంగా తప్పించుకుని ఆ విషయాన్ని దాటవేస్తున్నాడు. ఒకవేల పెళ్లి చేసుకుని ఉంటే.. ప్రభాస్ ఆస్తులు వారి పిల్లలకు చెందుతాయి. కానీ ఇప్పటివరకు ఆయన పెళ్లి చేసుకోలేదు. మరి మన ప్రభాస్ సంపాదించిన సంపదన అంతా ఎవరికి పెడతాడు అంటూ నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరి అభిప్రాయాల మేరకు.. డార్లింగ్‌కు సోదరుడు ప్రభోద్, సోదరి ప్రగతి ఉన్నారు. ఇక వీరితో పాటుగా.. పెదనాన్న కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ప్రభాస్ తర్వాత కూడా వివాహం చేసుకోకుండా అలాగే ఉంటే ఆయన ఆస్తులన్నీ వీరికే చెందుతాయని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ప్రభాస్ ఇప్పటికైనా ఒక ఇంటివాడు అవుతాడా.? లేక ఎప్పటికి ఇలాగే ఉంటాడా అనేది ఆయనకే తెలియాలి.