Venkatesh : పెద్ద రిస్క్ చేయబోతున్న వెంకటేష్.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఫ్యాన్స్

- Advertisement -

Venkatesh : ప్రస్తుతం నవతరం కథానాయకుల్లో ఎంతోమంది ప్రొడ్యూసర్ల కొడుకులు హీరోలుగా సాగుతున్నారు. వారందరికీ రోల్ మోడల్ ఎవరంటే ‘విక్టరీ’ వెంకటేష్ అనే చెప్పుకోవాలి. నిర్మాతల వారసుల్లో నటులుగా మారి సక్సెస్ సాధించి స్టార్ హీరోగా ఎదిగారు వెంకటేష్. ఆయన సక్సెస్‌ను చూసిన తరువాతే ఎంతోమంది ప్రొడ్యూసర్లు తమ కొడుకులను హీరోలుగా పరిచయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటి దాకా ఎవరూ వెంకటేష్ స్థాయి విజయాలను అందుకోలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో ‘విక్టరీ’నే ఇంటిపేరుగా మార్చుకున్నారు. కొన్నిసార్లు ట్రాక్ తప్పినా, మళ్లీ వైవిధ్యంతోనే ఆయన సక్సెస్ లను అందుకున్నారు. హీరోగా ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన వెంకటేష్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. మల్టీస్టారర్ మూవీస్‎లో కూడా నటించారు. అయితే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం తన అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది .

ఇప్పటి వరకు వెంకటేష్ తన కెరియర్లో ఎన్నడూ చేయని బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన ఓ తెలుగు హీరో సినిమా కోసం విలన్ గా మారబోతున్నాడట. ఈ న్యూస్ ఇప్పుడు ఇటు సినీ వర్గాల్లో, అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో నాగచైతన్య తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత విరుపాక్ష ఫేం దర్శకుడితో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు. మేనల్లుడి కోసం ఇంత రిస్క్ చేస్తున్నావా మామ అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here