Renu desai : ఆ విషయంలో బాగా హర్ట్ అయిన రేణుదేశాయ్.. ఇకనుంచి ఇన్ స్టాకు దూరం

- Advertisement -

Renu desai : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు పవన్ సరసన రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించి పాపులారిటీ దక్కించుకుంది రేణు దేశాయ్. పవన్ తో విడాకుల తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో నిరంతరం తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. తరచు తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ పంచుకుంటుంది ఈ అమ్మడు. ఇటీవల కాలంలో ఎక్కువగా పవర్ కళ్యాణ్ గురించి, తన పిల్లల గురించి, పెట్ డాగ్స్ ఫండ్ రైజింగ్ గురించి పలు విషయాలను షేర్ చేస్తుంది.

రేణు దేశాయ్
రేణు దేశాయ్

ఏ విషయం అయినా రేణు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే రియాక్ట్ అవుతుంది. ఆమె రిలేటివ్స్, అభిమానులు ఎవరైనా ఆమెను ప్రత్యక్షంగా సంప్రదించాలి అనుకున్న ముందుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఆమెకు పర్సనల్ గా మెసేజ్ చేస్తారని సమాచారం. అయితే తరచూ ఏదో ఒక అప్ డేట్ తో సోషల్ మీడియాలో సందడి చేసే రేణు దేశాయ్.. ఇప్పుడు ఇన్‌స్టాకు కాస్త బ్రేక్ ఇవ్వాలనుకుంటుందన్న టాక్ వినిపిస్తుంది. రేణు దేశాయ్ వారం రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఫాలోవర్లకు, అభిమానులకు రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


పవన్ కళ్యాణ్ విషయంలో ఆమె పెట్టిన పోస్టులకు ఆయన ఫ్యాన్స్ నుంచి వచ్చిన విమర్శలను, అలాగే పెట్ డాగ్స్ కోసం విరాళాల సమయంలో పలువురు స్పందించిన విధానం.. తనకు రూ.3,500 కావాలంటూ రిక్వెస్ట్ చేసిన ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే వీరు అడిగే ప్రతి ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందించి సమాధానం ఇచ్చింది. అయిన కొందరు పవన్ పై ఈమె చేసిన పోస్ట్ లకు వచ్చిన నెటిజ‌న్ల రియక్షన్లకు బాగా హర్ట్ అయి ఉంటుందని.. అందుకే ఇన్‌స్టాగ్రామ్ కు బ్రేక్ ఇచ్చిందంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here