Varun Sandesh : హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాను ఈ తరం వాళ్లు అంత త్వరగా మర్చిపోలేరు. అందులో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ ను కూడా తెలుగువారు గుర్తుపెట్టుకుని తీరుతారు. బక్కపలచని శరీరం.. ఒత్తైన జుట్టుతో పక్కింటి కుర్రాడిలా అనిపిస్తాడు. మొదటి సినిమా అయినా కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో నలుగురు కుర్రాళ్లు ఉన్నా వరుణ్ కే ఎక్కువ పేరు వచ్చింది. తర్వాత కొత్త బంగారు లోకం సినిమాలో నటించిన వరుణ్‌కి అసలు తిరుగే లేదు అనుకున్నారు. ఈ సినిమా కూడా హిట్ కావడంతో భవిష్యతులో వరుణ్ ఒక స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు.
వరుణ్ సందేశ్ కు తర్వాతర్వాత సినిమా అవకాశాలు మాత్రం వచ్చాయి కానీ.. ఆశించిన సక్సెస్ లు మాత్రం రాలేదు. తన కెరీర్లో ఇప్పటి వరకు దాదాపు ఒక 20 కి పైగా సినిమాలు చేసినా కూడా వరుణ్ కు స్టార్ హీరోగా గుర్తింపు రాలేదనే చెప్పుకోవాలి. హీరోయిన్ వితికా షేరును పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. ఇక ఈ జంట 2019లో బిగ్‌బాస్ లో సందడి చేసి మరోసారి జనాలకు దగ్గరైంది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకుముందులా కాకుండా మంచి కథలను ఎంచుకుంటూ భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ ‘నింద’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ .. దావత్ అనే చిట్ చాట్ షోకు అతిథిగా హాజరయ్యాడు. ఈ షోకు హాట్ బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా వరుణ్ ను తన లవ్ బ్రేకప్ గురించి అడిగింది. హీరోయిన్ శ్రద్దా దాస్ తో మీరు బ్రేకప్ అయ్యారంట.. నిజమేనా ఏంటా స్టోరీ అని అడిగింది. ఇప్పుడు అలాంటి విషయాలు మాట్లాడకండి. నా పెళ్లి అయ్యి ఎనిమిదేళ్లు అవుతుంది. మా మధ్య గొడవలు పెట్టకండి. అప్పట్లో మేమిద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాం. కానీ ప్రస్తుతం ఎవరి జీవితం వారిది. వాటి గురించి మాట్లాడదలచుకోలేదంటూ సమాధానం ఇచ్చాడు. కాగా వరుణ్- శ్రద్ధా కలిసి మరో చరిత్ర అనే సినిమాలో నటించారు. అప్పట్లో వీరి మధ్య ప్రేమాయణం నడిచిందన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ అందులో నిజం లేదని తేలింది.. ఇప్పుడు వరుణే స్వయంగా ఒప్పుకోవడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు.