Salaar 2 : షాకింగ్ న్యూస్.. ఆగిపోయిన సలార్ 2 ప్రాజెక్ట్.. ఆందోళనలో అభిమానులు

- Advertisement -

Salaar 2 : సినిమా అనేది రంగుల ప్రపంచం..ఎప్పుడు ఏ రంగులోకి మారుతుందో తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఏ టైంకి ఏమవుతుందో చెప్పడం కష్టం. అదొక మాయాలోకం. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏ సినిమా స్టార్ట్ అవుతుంది..? ఎప్పుడు ఏ సినిమా నుంచి ఎవరు వెళ్లిపోతారు ? కొత్త వాళ్లు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు ? అనేది చెప్పలేం. అంతేకాదు ఇటీవల కాలంలో బడా సినిమాలు కూడా సెట్స్ పైకి రాకముందే అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. దానికి కారణాలు ఏవైనా కావచ్చు.. కానీ బడా హీరో సినిమా అలా ఆగిపోతే మాత్రం ఆ బాధ నిజంగా వర్ణాతీతం. అలాంటి బాధను ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు.

అవును ప్రస్తుతం ప్రభాస్ తన తాజా చిత్రం కల్కి సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అని కొందరు అంటుంటే…… అంత సీన్ లేదు అంటూ తేలికగా తీసి పడేస్తున్నారు . అయితే ప్రభాస్ తర్వాత సెట్స్ పై కి తీసుకురావాల్సిన సలార్ 2 కూడా వెనక్కి వెళ్లిపోయింది . ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆగస్టులో సెట్స్ పైకి తీసుకొస్తామంటూ కూడా ప్రకటించాడు. దీంతో సలార్ 2 సినిమాను పట్టాలెక్కించడంతో మరింత జాప్యం తప్పదంటూ ప్రచారం జరిగింది . అయితే ఇప్పుడు సలార్ 2 సినిమా ఆగిపోయిందని ఓ వార్త ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది.

- Advertisement -

ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే కచ్చితంగా ఆ ఎఫెక్ట్ ప్రభాస్ తదుపరి సినిమాలపై పడుతుంది. తనకు ప్రెజర్ బాగా పెరిగిపోతుంది. సలార్2 సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ మరింత కేర్ తీసుకోవాల్సిన సమయం కూడా ఉంటుంది . అందుకే ప్రభాస్ కల్కి సినిమా రిజల్ట్ బట్టి ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని సక్రమంగా జరిగితే ది రాజా సాబ్ సినిమాతో పాటే స్పిరిట్ సినిమాను తీసుకొచ్చి మొదటగా స్పిరిట్ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట. సలార్ 2 పై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు చేదువార్త అనే చెప్పాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here