Shivani : టాలీవుడ్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెలుగు, తమిళ భాషల్లో మంచి మంచి సినిమాలు చేసి పాపులారిటీ తెచ్చుకున్నాడు. అలాగే ఆయన ఇద్దరు కూతుర్లు శివాని, శివాత్మికలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఆయన పెద్ద కూతురు శివాని వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటూ నిత్యం పలు రకాల పోస్టులు పెడుతూ తన క్రేజ్ రోజు రోజుకు పెంచుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శివాని ఓ యంగ్ హీరోను పెళ్లి చేసుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అయితే అది నిజజీవితంలో కాదు సినిమాలో భాగంగానే ఆమె పెళ్లి చేసుకుంది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయడంతో నెట్టింట్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ యంగ్ హీరోతో రెండేళ్ల నుంచి శివాని ప్రేమలో ఉన్నట్లు పలు పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. దానికి కారణం ఆమె వరుసగా అతనితో సినిమాలు చేస్తుంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు చివరికి అతనితో రిలేషన్‌ను కన్ఫర్మ్ చేస్తున్నావా ? ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.
అసలు శివాని సినిమాలు చేసిన ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. రాహుల్ విజయ్. అతనితో ఈ అమ్మడు ఇప్పటికే ఓ సినిమా చేయగా.. ఇప్పుడు మరో మూవీ చేసింది. ఈ చిత్రం మే 17న విడుదలైంది. ఈ క్రమంలోనే శివాని పెళ్లి కూతురిలా రెడీ అయిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమె రిలేషన్‌షిప్‌కు సంబంధించిన వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఈ విషయం తెలిసిన వారు మాత్రం పలు విధాలుగా చర్చించుకుంటున్నారు.
View this post on Instagram