Kevvu karthik : బుల్లితెరపై నెంబర్ వన్ షోగా దూసుకుపోతున్న కామెడీ షో జబర్దస్త్. ప్రేక్షకులను కడపుబ్బా నవ్విస్తూ ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ వెండితెరపై కూడా మంచి క్రేజ్ దక్కించుకున్నారు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో కెవ్వు కార్తీక్ కూడా ఒకడు. చాలా ఏళ్లుగా జబర్దస్త్ షో లో కార్తీక్ రాణిస్తున్నాడు. జబర్దస్త్‌తో పాటు పలు స్టేజ్ షోలు, ఈవెంట్లలో తన టాలెంట్ చూపించి ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు. ప్రేక్షకులను తనదైన టైమింగ్ పంచులతో అలరిస్తూ మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.
తాజాగా కార్తీక్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న అతడి తల్లి కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆమె మృతి చెందినట్లుగా కార్తీక్ తెలిపాడు. తన తల్లి గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. దాదాపు ఐదేళ్లకు పైనే ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుందట. కానీ అనూహ్యంగా కార్తీక్ తల్లి బుధవారం తుదిశ్వాస విడిచింది. దీంతో కెవ్వు కార్తీక్ ఇంట్లో అలాగే జబర్దస్త్ ఫ్యామిలీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషయాన్ని కార్తీక్ సోషల్ మీడియా ద్వారా తన బాధను వెల్లడించాడు. ఈ పోస్టులో.. ఐదేళ్లుగా తను క్యాన్సర్ తో పోరాటం చేసిందని, తన జీవితం మొత్తం యుద్ధమేనని, కష్టాల్లో మాకు తోడుగా నిలిచావని కెవ్వు కార్తీక్ రాసుకొచ్చాడు. నీ ఆత్మస్థైర్యమే నాలో ధైర్యాన్ని నింపిందని, కానీ నీవు లేకుండా ఎలా బతకాలో ఎందుకు నేర్పించలేదమ్మా అంటూ కెవ్వు కార్తీక్ ఎమోషనల్ అయ్యారు. తన అమ్మకు ఐదేళ్లుగా చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.
గురువారం ఉదయం నుంచి తన ఇంటి వద్దే పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచుతున్నామని కార్తీక్ చెప్పాడు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించాడు. అయితే రెండు నెలల క్రితమే తన తల్లి గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు కార్తీక్. గత ఐదేళ్లుగా తన తల్లి క్యాన్సర్‌పై యుద్ధం చేస్తుందంటూ చెప్పాడు. కానీ రెండు నెలల్లోనే ఆమె కన్నుమూయడంతో నెటిజన్లు.. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ ప్రార్థిస్తున్నారు.
View this post on Instagram