Nayantara : ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. భాషతో సంబంధం లేకుండా వరుసగా అన్ని చిత్ర పరిశ్రమల్లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. సీనియర్ హీరోలతో చేస్తూ నయన్ రోజు రోజుకు తన క్రేజ్ పెంచుకుంటూనే ఉంది. నయన తార నటించింది అంటే ఆ సినిమాకు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. అమ్మడికి పాన్ ఇండియా వైడ్ ఉన్న ఫాలోయింగ్ తోనే ఇది సాధ్యమవుతుంది.
ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. నయన తార లేటెస్ట్ స్టైలిష్ ఫొటోలతో నెట్టింట్టో రచ్చ చేస్తుంది. తాజాగా తన భర్తతో కలిసి ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేయించింది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో నయన్ తార మేకప్ లేకుండా కనిపించింది. నయన తారా స్వతహా దైవ భక్తి ఎక్కువ. ఖాళీ సమయం దొరికనప్పుడల్లా పలు పుణ్య క్షేత్రాలను సందర్శిస్తుంటారు.
నయన తార గతేడాది సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఆమె ఇన్స్టాలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. నయన్ ఇంట్రెస్టింగ్ పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటుంది. మొన్నీమధ్య షేర్ చేసిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు పద్దతిగా గుడిలో పూజలు చేయిస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా నయనతార మరొక స్టార్ హీరోతో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ మమ్ముట్టి నయనతార కాంబినేషన్లో ఇప్పుడు మరొక సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.