Kannappa : మంచు విష్ణు ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా ‘కన్నప్ప’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘మహాభారతం’ అనే హిందీ సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నారు. ‘అవా ఎంటర్టైన్మెంట్స్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంస్థల పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు ‘కన్నప్ప’ స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ న్యూజిల్యాండ్లో ప్రారంభమైంది. ఈ సినిమాలో చాలా మంది పెద్ద స్టార్స్ నటిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి ఇతర భాషల స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు.
అంతేకాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ‘కన్నప్ప’ లో నటిస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ప్రభాస్ ‘కన్నప్ప’ లో ఏ పాత్ర చేస్తున్నాడు అనే విషయం పై మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు. ముందుగా ఈ సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత నందీశ్వరుడిగా కనిపించబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడైతే ‘అవధూత’ అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు టాక్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో మంచు విష్ణు తన ఇన్ స్టాలో ఈ విషయం పై స్పందించారు.
ఇప్పటికే కన్నప్పలో ఎంతోమంది స్టార్ నటులు గొప్ప పాత్రలను పోషించడానికి సిద్ధమయ్యారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ విషయం చెప్తున్నా అంటూ మంచు విష్ణు తాజాగా మరో అప్డేట్ షేర్ చేసుకున్నాడు. కన్నప్ప సినిమాను నేను చేస్తున్న.. నువ్వు క్యారెక్టర్ చేయాలని విష్ణు మొదట ప్రభాస్‌కు చెప్పాడట. కథ బాగా నచ్చింది.. నాకు ఆ పాత్ర ఇంకా బాగా నచ్చింది. నేను ఈ క్యారెక్టర్ తప్పకుండా చేస్తానని ప్రభాస్ చెప్పాడట. నేను చెప్పిన పాత్ర కాకుండా ప్రభాస్‌కు నచ్చిన పాత్రలో ఆయన నటిస్తున్నాడని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. సినిమాకు సంబంధించిన ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తా.. అధికారికంగా ఆ పాత్రల గురించి మేము చెప్పినప్పుడు మాత్రమే నమ్మండి అంటూ ఆయన తెలిపాడు. బయట వచ్చే పుకార్లన్నీ అవాస్తవాలే అన్నాడు. సోమవారం ఓ అద్భుతమైన అప్డేట్ రానుంది అంటూ ఆయనన్నాడు.
View this post on Instagram