Surekha Vani : తన లవ్ మ్యాటర్ బయటపెట్టిన సురేఖా వాణి డాటర్ సుప్రీత.. అబ్బాయి ఎవరంటే ?

- Advertisement -

Surekha Vani : టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో అక్క, వదిన, అమ్మ పాత్రలకు కేరాఫ్ గా నిలిచారు సురేఖా వాణి. బ్రహ్మానందం భార్యగా వెండితెర మీద బాగా పాపులర్ అయింది. సురేఖ వాణి ఒకప్పుడు ఎంతో బిజీ నటి. దాదాపు అగ్రహీరోల సినిమాలన్నింటిలో ఆమె ఉండేది. కానీ ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రాలు దాదాపు లేవనే చెప్పాలి. కొన్నాళ్ల కిందట సురేఖా వాణి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఆ తర్వాత సురేఖ వాణి, తనకు కుమార్తె సుప్రీతతో కలిసి అనేక వీడియోల్లో దర్శనమిచ్చారు.

పొట్టి పొట్టి డ్రస్సులు, పబ్ కల్చర్ తో మోడ్రన్ గా ఉన్న సురేఖా వాణిని ఆ వీడియోల్లో చూడొచ్చు. దాంతో ఆమె లైఫ్ స్టయిల్ పై చాలామంది విమర్శించారు. చేతిలో సినిమాలు లేకపోయినా అంత డబ్బు.. ఇంత లగ్జరీ జీవితం ఎలా సాధ్యం? అంటూ కథనాలు వచ్చాయి. ఓ అడుగు ముందుకేసి, ఆమె మరో రిలేషన్ లో ఉందంటూ పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. అయినా వాటన్నింటినీ పట్టించుకోకుండా వారి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఇక సురేఖ వాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో బాగా పాపులర్. ఈ అమ్మడు సినిమాల్లో నటించినప్పటికీ తల్లితో కలిసి చేసే రచ్చ అంతా ఇంత కాదు. సుప్రిత సోషల్ మీడియాలో పలు హాట్ ఫొటోస్ షేర్ చేసి తల్లిని మించిన పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ తో ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా, సుప్రీత చేసిన పోస్ట్ నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ.. నా జీవితంలోకి కొందరు వస్తుంటారు వెళుతుంటారు. అదే లైఫ్ అంటే’’ అని రాసుకొచ్చింది. అలాగే కామెంట్స్ కూడా హైడ్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు ఎవరితోనైనా ప్రేమలో పడిందేమో.. అందుకు ఈ విషయాన్ని ఈ పోస్టులో బయటపెట్టిందని చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ సుప్రిత ఫొటోలు మాత్రం కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here