Sunil : చాలామంది రాజకీయాలను, సినిమాలను వేరు వేరుగా చూస్తుంటారు. ఆయా రంగాలకు సంబంధించిన వ్యాఖ్యలు, ప్రస్తావనలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక రంగం వారు మరో రంగం వారిని పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఈ మధ్య అందుకు భిన్నంగా జరుగుతోంది. ఎందుకంటే చాలా మంది సినీ ప్రముఖులు పాలిటిక్స్‌లో చేరుతున్నారు. రాజకీయ నాయకులు కూడా సినీ ప్రముఖులతో కలిసి మెలిసి తిరుగుతున్నారు. దీంతో సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఇరువైపులా పరస్పర వ్యాఖ్యలు, కామెంట్స్ కామన్ అవుతున్నాయి. ఇటు రాజకీయ, అటు సినీ వర్గాలతో పాటు ప్రజల్లోనూ అవి ఆసక్తి రేపుతుంటాయి. తాజాగా మరోసారి అలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ చిరంజీవి రాజకీయ జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి తమ్ముుడు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నాడు. తమ్ముడికి మద్దతుగా చిరంజీవి కూడా పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో ప్రముఖ కమెడీయన్ సునీల్, మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి సక్సెస్ కాలేకపోవడానికి అదే కారణమంటూ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుండటంతో ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.
ఇంతకీ అప్పట్లో సునీల్ ఏమన్నారంటే.. ‘‘చిరంజీవి గారిని చాలామంది రాజకీయాల్లో సక్సెస్ కాలేదని అంటుంటారు. అది నిజమే. ఆయన సక్సెస్ కాలేదు. కానీ ఆయన వర్క్ విషయంలో మాత్రం ఆయనే టాప్. ఆయనే నెంబర్ వన్. స్వయంకృషితో చిరంజీవి ఈ స్థాయికి ఎదిగారు. రాజకీయాల్లోనూ పది మందికి ఉపయోగపడాలనుకున్నారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. ఒక నాయకుడి చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఒక్కరు తప్పటి అడుగులు వేసినా ఫలితం ఉండదు. చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. ఆయన చుట్టూ ఉన్నవారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంవల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. అదే ఆయన సక్సెస్ కాలేకపోవడానికి కారణం’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్‌కు, జనసేనాని పవన్ కు ప్లస్ అవుతాయా? మైనస్ అవుతాయా? అని చర్చ నడుస్తోంది.