Tamanna : ఆ సినిమా చూసి ఒంటి మీద వెంట్రుకలు తొలగించుకోవడం మానేశానన్న తమన్నా

- Advertisement -

Tamanna : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా సెలబ్రిటీలు జనాలకు చాలా దక్కరైపోయారు. సెలబ్రిటీలకు అక్కడ ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల రీల్ లైఫ్ గురించి అన్ని విషయాలు ఏదో ఒకలా వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రం చాలా తక్కువగా అందరికీ తెలుస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం సెలబ్రెటీలు అన్ని విషయాలను కూడా తమ తమ అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకునేందుకు ఇష్టపడుతున్నారు.

కొన్ని కొన్ని సార్లు వారు చెప్పే ఆసక్తికర విషయాలు జనాలకు అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు జనాలకు ఆశ్చర్యపరుస్తున్నాయి. తమన్నా గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటుతోంది. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడినప్పటికీ ఒక వైపు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూనే మరో వైపు పలు వెబ్ సిరీసులు చేస్తూ బిజీ బిజీగా కెరీర్లో కొనసాగుతోంది. అయితే ఇటీవలే తన రియల్ లైఫ్ లో జరిగిన దాని గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది తమన్నా.

- Advertisement -

ఓ హాలీవుడ్ సినిమా చూసిన తర్వాత తాను వాక్సింగ్ చేసుకోవడం మానేశానంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్ సినిమా ‘హౌస్ ఆఫ్ వ్యాక్స్’ చూసిన తర్వాత వ్యాక్సింగ్ (చర్మంపై రోమాలు తొలగించడం) చేయించుకోవడం మానేశాను. ఆ సినిమాలో వ్యాక్స్ తో పలు రకాలుగా చంపేస్తారన్న విషయాన్ని గుర్తు చేసింది మిల్కీ బ్యూటీ. ఇకపోతే ఈ మిల్కీ బ్యూటీ హీరోయిన్ గా నటించిన హర్రర్ కామెడీ సినిమా బాక్ మే మూడవ తారీఖున విడుదల కాబోతుంది. సుందర్ సి. దర్శకత్వం లో తెరకేక్కిన ఈ మూవీలో రాశి కన్నా మరో హీరోయిన్ గా నటిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here