Niharika : ఈ మధ్య కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలెబ్రీటీలు విడిపోతున్నారు. మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ విడిపోయారు.. ఇద్దరూ వేర్వేరుగా బతుకుతున్నారు అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడులో ఈ విషయం బాగా వైరల్ అవుతోంది.నిహారిక తన భర్తకు దూరం కాబోతోంది అంటున్నారు. అంతేకాదు ఈ మధ్య నిహారిక కూడా సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేదు. అసలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ సెలబ్రేషన్స్ లోనూ కనిపించడం లేదు.. నిహారిక డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం వల్లే ఆమె భర్త దూరం పెట్టాడని మరోవైపు గుసగుసలు వినిపించడం గమనార్హం..
పెళ్లి కాకముందు మెగా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాల్లో చాలా యాక్టివ్ గా ఉండేది నిహారిక. కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో తన లక్ ను పరీక్షించుకుంది. కానీ.. తను సినిమాల్లో అంతగా రాణించలేకపోయింది. తనను ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోయారు. ఇక సినిమాలు పనికి రావని తను సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. ఒకవైపు వెబ్ సిరీస్లను చేస్తూనే మరోవైపు తన తండ్రి చూసిన సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో చైతన్యతో తనకు వివాహం జరిగింది.
పదేళ్ల తర్వాత రామ్ చరణ్ గుడ్ న్యూస్ చెప్పాడు. తను తండ్రి కాబోతున్నట్టు ప్రకటించాడు. కనీసం ఆ విషయం గురించి కూడా సోషల్ మీడియాలో స్పందించలేదు నిహారిక. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. అసలు ఏమైంది.. ఎందుకు తన భర్తతో దూరంగా ఉంటోంది… ఏమైనా బ్యాడ్ న్యూస్ చెబుతుందా అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.. నిజానికి వారిద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగిందో వాళ్ళే చెప్పాలి.. అప్పుడే అందరికి క్లారిటీ వస్తుంది..