Samantha : పెళ్లి గౌను రీమోడలింగ్ చేయించిన సమంత.. నాటి గుర్తులేవి ఉండొద్దనా ?

- Advertisement -

Samantha : కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వాటిలో ఇప్పటికే డివోర్స్ తీసుకున్న వారిలో సమంత, చైతు జంట ఒకటి. కారణాలేంటో తెలీవు కానీ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న కొంత కాలంలోనే తమ విడాకుల ప్రకటనతో అభిమానులకు షాకిచ్చారు. వీరిద్దరు 2021లో విడాకులు తీసుకోబోతున్నామంటూ ప్రకటించారు. వీరు విడిపోయి నాలుగేళ్లు కావొస్తున్న ఇద్దరి గురించి నిత్యం ఏదో ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇప్పటికే నాగచైతన్య జ్ఞాపకాలను చెరిపేసే పనిలో ఉంది సమంత. ఇన్ స్టాలో ఫోటోస్ డెలీట్ చేయడం.. తన పేరుతో వేయించుకున్న టాటూ తొలగించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పెళ్లినాటి జ్ఞాపకాలను మార్చేసింది. తన పెళ్లినాటి గౌనును రీమోడలింగ్‌ చేయించి ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమంలో స్టేజ్‌పై మెరిసింది. ప్రస్తుతం సమంత తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారుతోంది.

 

- Advertisement -

2017లో క్రిస్ట్రియన్ , హిందూ సంప్రదాయాల ప్రకారం సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్లలో ముందుకు సాగుతున్నారు. అయితే సమంత ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిలో ధరించిన తెల్లటి గౌనును మార్చేసి నల్లటి మోడ్రన్ డ్రెస్ గా మార్చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ సుధీర్ఘ నోట్ రాసుకొచ్చింది. ‘ఇకపై నేను ధృడంగా ఉండడం మర్చిపోలేము. నాకు ఎంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ఈ అవార్డు ప్రోగ్రాం కోసం ఉపయోగించాను. దీనిని అందంగా మార్చిన క్రేశాబజాజ్ కు కృతజ్ఞతలు. నా అలవాట్లను మార్చుకోవడం.. జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటి. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. ఎల్లే లీడర్స్ ఆఫ్ ఛేంజ్ గా నన్ను ఎంపిక చేసినవారికి ధన్యవాదాలు ” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

View this post on Instagram

 

A post shared by Krésha Bajaj (@kreshabajajofficial)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here