KS Ravi Kumar : నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు లక్షలాదిమంది అభిమానులున్నారు. దాంతో పాటు విమర్శించే కొంతమంది విరోధులు ఉన్నారు. ఆయన కోపంగా ఉంటారంటూ, ప్రవర్తన మీద ఎన్నో ఎన్నో రకాల కామెంట్స్ అపుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ బాలయ్యా బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన సైకో అనడం నెటింట్లో ప్రస్తుతం దుమారమే రేపుతోంది. ఆయనెవరో కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కె.ఎస్.రవికుమార్. తను బాలకృష్ణతో కూడా పలు సినిమాలను తెరకెక్కించారు.
రజినీకాంత్, కమలహాసన్ లాంటి కోలీవుడ్ టాప్ హీరోలకు బ్లాక్ బస్టర్లు అందించారు రవికుమార్. బాలయ్యతో పలు సినిమాలను రూపొందించి హిట్లు అందుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఈయన మాట్లాడుతూ.. బాలకృష్ణ పై కీలకవ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఓ సైకోలా మారారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఓ ఘటన బాలకృష్ణ మీద మనసు విరిగిపోయేలా చేసిందంటూ చెప్పుకొచ్చారు. సాగర సంగమం భారీ సక్సెస్ అందుకోవడంతో.. అప్పట్లో సీఎంగా ఉన్న ఎన్టీఆర్ తన కొడుకు బాలకృష్ణతో కూడా ఓ సినిమాను చేయమని కె.విశ్వనాథ్‌ని కోరారట. ఆయన ఎన్టీఆర్ కోరికను తీర్చేందుకు జనని జన్మభూమి టైటిల్ తో బాలయ్యతో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు.
ఈ సినిమాకు కె.ఎస్.రవికుమార్ అసోసియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే బాలయ్యతో ఆయనకు పరిచయం ఏర్పడింది.. జననీ జన్మభూమి షూటింగ్ డైరెక్టర్ రవికుమార్ ఇంటికి దగ్గరలోనే జరిగిందట. వయసులో ఉన్న బాలయ్య చాలా సరదాగా ఉండే వారిని.. అందరితో కలిసి పోయే వాడట. రాను రాను బాలకృష్ణ ఓ సైకోలా మారిపోయాడని షాకింగ్ కామెంట్ చేశాడు. ఒకరోజు కొందరు అభిమానులు బాలయ్యను కలిసేందుకు వచ్చారని.. ఒక్కొక్కరిగా బాలయ్య పక్కన నిల్చోని ఫోటోలు దిగుతున్నారని.. వారిలో ఒక అభిమాని బాలయ్య భుజం మీద చేయి వేశాడని కోపంతో బాలయ్య ఆయనను కొట్టాడంటూ చెప్పుకొచ్చాడు.
ఈ ఘటన తర్వాత నాకు ఆయనపై మనసు విరిగిపోయిందంటూ చెప్పుకొచ్చారు. అతను ఒక సైకో.. సంస్కారం లేనివాడంటూ కామెంట్ చేశాడు. తిరిగి ఆ వ్యక్తి నిన్ను కొడితే నీ పరువు ఉంటుందాని రవికుమార్ ప్రశ్నించాడు. గతంలో కూడా బాలయ్య పై కె.ఎస్.రవికుమార్ ఎన్నో ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచాడు. నవ్వాడన్న కారణంతో కూడా ఓ సారి తన అసిస్టెంట్ ని బాలకృష్ణ కొట్టబోయాడు.. నేనే ఆయనను ఆపాను అంటూ గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ సమయంలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవికుమార్ చేసిన వ్యాఖ్యలు నెటింట్లో వైరల్‌గా మారాయి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు.