Star Couple : విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. ఇది ఎవరూ ఊహించని ట్విస్ట్

- Advertisement -

Star Couple : సినిమా ఇండస్ట్రీలో రూమర్స్, గాసిప్స్ ఎక్కువ. సెలబ్రిటీల లైఫ్ 24 గంటలు కెమెరా లెన్సులోనే చిక్కుకుని ఉంటుంది. వాళ్లెప్పుడు అలర్ట్ గానే ఉండాలి. కాస్త రిలాక్స్ అయ్యారో ఎన్ని రూమర్స్, ఎన్ని గాసిప్స్.. ఇక ఈ మధ్య ట్రోల్స్.. కు లెక్కే ఉండదు. వాటికి క్లారిటీ ఇచ్చుకోలేక కొందరు సతమతమవుతుంటే.. ఇవాల్సిన అవసరం లేదని కొందరు చిల్ అవుతూ గాసిప్స్ ను కేర్ చేయరు. అయితే కొన్ని రూమర్స్ మాత్రం వాళ్ల లైఫ్ ను నాశనం చేస్తాయి. అలాంటి వాటిలో వారి పర్సనల్, లవ్, మ్యారేజ్ లైఫ్ రూమర్స్ వాళ్ల జీవితాలను చాలా ఇంపాక్ట్ చేస్తాయి. ఫలానా జంట విడిపోతుందట.. అనే రూమర్ చాలా డేంజర్.

అయితే ఇటీవల సినిమా ఇండస్ట్రీలో విడాకులు ఎక్కువవుతుండటంతో ఈ రూమర్స్ వచ్చినా.. అవి నిజమనే నమ్మేస్తున్నారు నెటిజన్లు. తాజాగా విడాకుల బాటలో మరో స్టార్ కపుల్ అంటూ ఓ స్టార్ హీరోయిన్ గురించి న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ త్వరలోనే విడాకులు తీసుకోబోతోందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యూటీవీ మోషన్ పిక్చర్స్ సీఈవో సిద్దార్థ్ రాయ్ కపూర్‌తో ప్రేమలో పడిన విద్యా బాలన్.. 2012 డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఈ జంట చాలా ప్రేమగా హ్యాపీగా కలిసి ఉంటోంది. అయితే ఈ జంట ఎక్కువ లైమ్ లైట్ లో కనిపించదు. కనీసం విద్యా బాలన్ పలు ఈవెంట్లలో కనిపిస్తుంది కానీ సిద్ధార్థ్ ఎక్కువగా బయట కనిపించడు. అయితే ఇన్నేళ్లు హాయిగా గడిపిన ఈ స్టార్ కపుల్ ఇప్పుడు విడిపోతున్నారంటూ నెట్టింట ఓ వార్త అభిమానులకు షాక్ ఇచ్చింది.

- Advertisement -

తరచూ వివాదాస్పద ట్వీట్లు, వార్తలతో సంచలనం రేపే ఉమేర్ సంధూ ఈ రూమర్ క్రియేట్ చేశాడు. విద్యాబాలన్, ఆమె భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ విడిపోయారు. వేర్వేరుగా కాపురం ఉంటున్నారు అని తను ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తున్నాడంటూ మండిపడుతున్నారు. వాళ్లు విడిపోలేదంటూ బల్లగుద్ది చెబుతున్నారు నెటిజన్లు. నీ కన్ను వీళ్ల మీద పడిందా అంటూ ఇంకొందరు ఫైర్ అవుతున్నారు. ఇదంతా ట్రాష్ అంటూ విద్యా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా ఉమేర్ సంధు ట్వీట్ ఇప్పుడు విద్యా బాలన్ ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇచ్చింది.

ఇక విద్యా బాలన్ సినిమాల సంగతికి వస్తే ఈ భామ పరిణీతి అనే చిత్రంతో హిందీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తొలి సినిమాలోనే తన నటనతో అదరగొట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బీ టౌన్ లో స్టార్ గా ఎదిగింది. ఈ భామ నటించిన డర్టీ పిక్చర్ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఈ భామ మరో అర్థం చెప్పింది. లేడీ ఓరియెంటెడ్ అంటే ఫైట్లు చేస్తూ యాక్షన్ సీన్స్ చేయడమే కాదు.. ఓ గృహిణిగా.. ఓ సైంటిస్టుగా.. ఓ డిటెక్టివ్ గా కూడా మెప్పించొచ్చని ప్రూవ్ చేసింది. విద్యా కెరీర్ లో డర్టీ పిక్చర్,  శాకుంతల దేవీ, షేర్నీ, జల్సా, నీయత్ లాంటి సినిమాలది చాలా ప్రత్యేక స్థానం. ఇక ఇప్పుడు ఈ భామ చాలా కాలం తర్వాత దో ఔర్ దో ప్యార్ అనే సినిమాలో నటించింది. ఈ  చిత్రంలో విద్యా బాలన్ లిప్ లాక్స్ సీన్స్ లో నటించడం ఇప్పుడు బీ టౌన్ లో తెగ చర్చకు దారి తీసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here