Star Actress : సినిమా ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు, ప్రేమ-బ్రేకప్ సర్వసాధారణం. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతారు. కొందరు ఏళ్ల తరబడి ప్రేమ, పెళ్లి బంధంలో ఉన్నా.. చివరకు ఎవరి దారిలో వాళ్లు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక డేటింగ్, బ్రేకప్ ట్రెండ్ చాలా కామన్. తాజాగా ఓ హీరోయిన్ హార్ట్ మరోసారి బ్రేక్ అయింది. ఈ స్టార్ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..?
విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్. తన తండ్రి పేరుతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. తన టాలెంట్ తో అవకాశాలు సంపాదించుకుంటోంది. ఓవైపు హీరోయిన్ గా.. మరోవైపు సింగర్ గా… ఇంకోవైపు మ్యూజిషియన్ గా బిజీ లైఫ్ గడుపుతోంది. ఇటీవలే ఈ బ్యూటీ ప్రభాస్ తో నటించిన సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈ భామ కెరీర్ లో చాలా పీక్ స్టేజ్ లో ఉంది. ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే శ్రుతి సినీ కెరీర్ ఎంత హిట్ అవుతుందో పర్సనల్ లైఫ్ అంత గందరగోళంగా అయిపోతోందని నెటిజన్లు అంటున్నారు.
ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయినట్లు ఇప్పుడు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
శ్రుతి కొన్నేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇలస్ట్రేటర్ శాంతను హజారికతో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట విడిపోయిందనే న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. శాంతనుతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను శృతిహాసన్ సోషల్ మీడియా నుంచి తొలగించింది. అంతే కాదు ఈ జంట ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాల్ కావడం లేదు. ఇన్నాళ్లు ఫాలో అయిన వీరు ఇప్పుడు అన్ ఫాలో కావడంతో నెటిజన్లు వీళ్లకు బ్రేకప్ అయిందని భావిస్తున్నారు.
అంతే కాదు అంతకుముందు మూవీ ఫంక్షన్‌లకు, ఇతర వేడుకలకు శ్రుతి హాసన్, శాంతను కలిసి హాజరయ్యేవారు. అయితే తాజాగా ‘హీరామండీ’ ప్రీమియర్ షోకి శ్రుతి ఒంటరిగా వచ్చింది. దీంతో ఈ ఇద్దరూ విడిపోయారని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. చాలా రోజుల నుంచి ఇద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని సమాచారం. గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి రూమర్స్ వస్తే శ్రుతి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై ఇంకా ఇరు వర్గాల నుంచి ఎటువంటి స్పందన లేదు. శ్రుతి హాసన్‌కు ఇది సెకండ్ బ్రేకప్. ఇంతకు ముందు ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్స్ లేతో డేటింగ్ చేశాక విడిపోయింది.