Anne Hathaway : సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. పరదా బయట కనిపించే రంగులే కాదు.. తెర వెనుక ఎన్నో చీకటి రంగలుంటాయి. అవన్నీ దాటుకుని ధైర్యంగా ఎదుర్కొనే వస్తేనే ప్రేక్షకులు నీరాజనం పట్టే స్థాయికి ఎదుగుతారు. అయితే మూవీ ఇండస్ట్రీలో అబ్బాయిలకు ఒకటే సమస్య.. అవకాశాలు రాకపోవడం. వాటి కోసం వాళ్లకు టాలెంట్ దాంతో పాటు కాస్త లక్ ఉంటే చాలు. కానీ అమ్మాయిలకు అలా కాదు. చాలా మంది హీరోయిన్లు, నటీమణులు .. ఇప్పుడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా.. కెరీర్ మొదట్లో అవకాశాలం కోసం ఎదురుచూస్తున్నప్పుడు.. క్యాస్టింగ్ కౌచ్, కమ్మిట్మెంట్ సమస్యలు ఎదుర్కొన్నవారే. కొందరు ఛాన్సుల కోసం వాటికి కమిట్ అయితే ఇంకొందరు సైలెంట్ గా అక్కడి నుంచి తప్పుకుని మరో ఛాన్స్ కోసం ఎదురుచూసిన వాళ్లున్నారు.
అయితే ఇలాగే సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనకు జరిగిన ఓ ఘోర సంఘటన గురించి ఓ స్టార్ హీరోయిన్ ఇటీవల షేర్ చేసుకుంది. తాను ఆడిషన్ కు వెళ్లినప్పుడు పది మందికి లిప్ లాక్ ఇవ్వమని అడిగారట మేకర్స్. అప్పుడు ఆమె ఎలా ఫీల్ అయింది..? అక్కడి నుంచి ఎలా బయట పడింది..? ఆ తర్వాత ఎలా గెటాన్ అయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది..? అనే విషయాలను ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..?
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్నే హాత్వే తనకు గతంలో ఓ ఆడిషన్లో ఎదురైన చేదు అనుభవం గురించి షేర్ చేసుకుంది. తన లేటెస్ట్ మూవీ ది ఐడియా ఆఫ్ యు ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 2న విడుదల కానున్న సందర్భంగా ఆమె ఓ హాలీవుడ్ మేగజైన్‌తో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని పంచుకుంది.
సాధారణంగా నటీనటులకు ఆడిషన్ నిర్వహించినప్పుడు అందులో.. భారీ డైలాగ్స్ చెప్పమనో, ఎమోషన్స్ చూపించమనో, డ్యాన్స్ చేయమనో అడుగుతుంటారు. కానీ తాను భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్లు అన్నే హాత్వే చెప్పింది.
నా కెరీర్ స్టార్టింగ్‌లో నేనో సినిమా ఆడిషన్‌కు వెళ్లా. హీరో- హీరోయిన్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో టెస్ట్ చేసేందుకు అక్కడికి వచ్చిన పది మంది అబ్బాయిలను ముద్దు పెట్టుకోమని నాకు చెప్పారు. కెమిస్ట్రీ ఎలా ఉంటుందో టెస్ట్ చేసేందుకు నటీనటులను కలిసి నటించమని అడగడం మామూలే. కానీ పది మందిని కిస్ చేయమని కరెక్ట్ కాదు. అని పేర్కొంది. అయితే ఆమె ఏ సినిమా ఆడిషన్లో తనకు ఇలా జరిగిందో వెల్లడించలేదు.
అన్నే హాత్వే టెలివిజన్ సిరీస్ గెట్ రియల్‌తో నటిగా కెరీర్ ప్రారంభించి… 2001లో వచ్చిన ది ప్రిన్సెస్ డైరీస్తో హీరోయిన్గా మారింది. తర్వాత లవ్ అండ్ అదర్ డ్రగ్స్, వన్ డే, ది ఇంటర్న్, ది డార్క్ నైట్ రైజెస్, వాలంటైన్స్ డే, ఇంటర్స్టెల్లార్ సినిమాలతో హిట్లు అందుకుని ఇటీవల ది ఐడియా ఆఫ్ యుతో నిర్మాతగా మారింది.