Samantha : సోషల్ మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత

- Advertisement -

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. తన కెరీర్లో తాను నటించిన హిట్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే బాక్సాఫీసును షేక్ చేసింది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తనలోని నటనను ప్రూవ్ చేసుకుంటూ అనతి కాలంలోనే కోట్లాది మందికి ఆరాధ్య దేవతగా మారింది. స్టార్ హీరోల సరసన నటించి నటిగా పాపులర్ అయింది. ఇటీవల కొంతకాలంగా సమంత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన గురించి అప్ డేట్స్ ఇస్తూ యాక్టివ్ గానే ఉంటోంది.

Samantha
Samantha

ఎన్నడూ లేని విధంగా సమంత ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది. హాట్ అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజాగా సోషల్ మీడియా పై సంచలన వ్యాఖ్యలు చేసింది.. అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్ లో.. సోషల్ మీడియాను తక్కువగా ఉపయోగించవద్దు. అంతర్జాతీయంగా దీన్ని ఎక్కువగా ఉపయోగించండి. మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులను అనుసరించండి. నిపుణులతో నిమగ్నమవ్వడం ద్వారా మీరు నిజమైన, సానుకూల స్నేహాన్ని సృష్టించడం ఇక్కడ నేర్చుకోవచ్చు. తెలివి తక్కువగా ఇక్కడ స్క్రోలింగ్ చేయడం, ఫిర్యాదు చేయడం, ద్వేషించడం, ప్రతికూలతను, తప్పుడు ప్రచారాలను అసలు చేయకండి అంటూ రాసుకొచ్చింది.

- Advertisement -

సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇండస్ట్రీల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. తనకు వచ్చిన అనారోగ్యం కారణంగా కొంత కాలంగా నటనకు గ్యాప్ ఇచ్చి సినిమాలకు దూరంగా ఉంటుంది. వెండి తెరకు దూరమైనా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తన అనారోగ్యల సమస్యల కారణంగా గతంలో సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసింది. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుంటానని బహిరంగంగా ప్రకటించింది. అనుకున్న విధంగానే సినిమాలకు దూరం అయ్యింది. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా నిత్యం వార్తల ముఖ్యాంశాల్లో ఉంటుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here