Madhuri Dixit : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్… నెట్టింట్లో కాకరేపుతున్న పోస్టు

- Advertisement -

Madhuri Dixit : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇందులో ప్రవేశించాలని ఎంతో మంది కలలు కంటుంటారు. అవకాశాలు రావాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందే అన్న టాక్ కూడా ఉంది. కొంతమందిని సంతృప్తి పరిస్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇకపోతే వాటితో పాటు సినీ ఇండస్ట్రీలో డేటింగ్, రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం సర్వసాధారణ విషయం. నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో, సినీ తారలు రిలేషన్‌షిప్ నడపడం చాలా కాలంగానే కొనసాగుతుంది. అయితే కొందరు పెళ్లి చేసుకుని తమ బంధాన్ని పర్మినెంట్ చేసుకుంటున్నారు. కానీ మరికొందరు మాత్రం డేటింగ్ చేసి ఏవో కారణాల వల్ల మధ్యలోనే విడిపోతున్నారు.

కొందరు ప్రెగ్నెంట్ అయి పిల్లలు, పుట్టాక విడిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మరో స్టార్ హీరోతో డేటింగ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ అయినట్లు ఓ పోస్ట్ నెట్టింట్లో సంచలనం సృష్టిస్తోంది. అసలు మేటర్ ఏంటంటే.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ గతంలో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నట్లు నెట్టింట్లో పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మానసికంగా, శారీరకంగా దగ్గరయ్యారని కూడా చర్చించుకున్నారు. కొద్ది కాలం పాటు వీరిద్దరూ డేటింగ్ చేశారట కూడా. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. కానీ ఆ తర్వాత సంజయ్ దత్ ఓ కేసులో అరెస్ట్ కావడంతో మాధురీ దీక్షిత్ అతనికి దూరంగా ఉందట. తాజాగా, సంజయ్ తో డేటింగ్ చేయడం వల్ల మాధురీ ప్రెగ్నెంట్ అయినట్లు సినీ క్రిటిక్ ఉమైర్ సంధు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడంతో వీరి వ్యవహారం మళ్లీ నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది.

- Advertisement -

ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ ట్వీట్ చూసిన వారంతా ఉమైర్ సంధుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగింది మర్చిపోయి తమ తమ ఫ్యామిలీస్‌తో సంతోషంగా ఉన్న వారిపై ఇలాంటి పోస్ట్ పెట్టడం ఏంటని? కోపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సంజయ్ దత్ మాన్యత అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. ఇక మాధురీ ఓ డాక్టర్‌ను పెళ్లాడి సంతోషంగా గడుపుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here