Soundarya : సౌందర్య వీలునామాలో ఏముందో తెలుసా..ఇన్నాళ్లకు బయట పడిన వాస్తవం

- Advertisement -

Soundarya : తెలుగు సినీ ప్రియుల మదిలో చిరకాలంగా నిలిచిన అపురూపం సౌందర్య. అద్భుతమైన నటనతో సినీ పరిశ్రమలో, ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. డాక్టర్ కావాల్సిన అమ్మాయి.. నటిగా మారి కోట్లాది మంది అభిమానాన్ని దక్కించుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. చక్కటి చీరకట్టులో.. నిండైన రూపంతో పదహారణాల తెలుగింటి అమ్మాయిగా కనిపించి అలరించింది. దశాబ్దకాలం పాటు వెండితెరపై సందడి చేసింది.

అతి తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన సౌందర్య.. అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. 2004లో జరిగిన ఆ ఘటన ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. మరణించే సమయానికి సౌందర్య రెండు నెలల గర్భవతి. 17 ఏప్రిల్ 2004లో అనుకోని ప్రమాదంలో తన సోదరుడితోపాటు సౌందర్య ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. సౌందర్య మరణించి 20ఏళ్లు అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న అందరికీ బాగా నచ్చేసే హీరోయిన్ సౌందర్య. ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ జనాలు ఇప్పటికీ ఆమెను ఆరాధిస్తూ ఉంటారు. ఆమె పేరుని జపిస్తూ ఉంటారు. దానికి కారణం సౌందర్య మంచితనం. అప్పట్లో మహానటి సావిత్రి గారి తర్వాత సౌందర్య అలాంటి పేరు దక్కించుకుంది.

- Advertisement -

soundarya mother manjula

మంచి మంచి సినిమాల్లో నటిస్తూ ఆమె కెరియర్లో బాగానే డబ్బులు సంపాదించింది. సౌందర్య కి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది . సౌందర్య చాలా ఆస్తిని కూడ పెట్టిందట . అయితే ఆమె చనిపోయే సమయానికి ఆమె గర్భవతి.. కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్న సౌందర్య తన మరణానికి ముందే ఆస్తికి సంబంధించిన వీలు నామ రాసిందట. వీలునామాలో తన కోట్ల ఆస్తి మొత్తం కూడా భర్తతోపాటు.. తల్లిదండ్రులకి దక్కేలా రాసిందట. అయితే ఈ విషయంపై తన తల్లి మాత్రం నెగిటివ్ గా స్పందించింది. 31 ఏళ్ల వయసులో వీలునామా ఎందుకు రాస్తుంది ..? అసలు ఆమె చనిపోతుందని ఆమెకు తెలుసా..? రాయాల్సిన అవసరం ఏంటి..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందట. నిజానికి సౌందర్య చనిపోయిన తర్వాత తన తల్లిదండ్రులకి ఒక్క రూపాయి ఆస్తి ఇవ్వకుండా భర్తనే మొత్తం అనుభవిస్తున్నాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here