Anchor Manjusha : సీఎం జగన్‌‌ని హేళన చేసిన యాంకర్ మంజూష.. మండిపడుతున్న వైసీపీ నేతలు?

- Advertisement -

Anchor Manjusha: తెలుగులోని అన్ని టీవీ చానల్‌లో యాంకర్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది యాంకర్‌ మంజూష. ‘రాఖీ’ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు చెల్లెలిగా నటించింది. ఆ తర్వాత పలు సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తోంది. సినిమా వేడుకలు, షోస్‌, మోడలింగ్‌లో మంజూష బిజీగా ఉన్నారు. ఆమె ఇటీవల ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాళ్లదాడిని హేళనగా మాట్లాడింది. దీంతో ఆమెపై వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. అసలు సీఎం జగన్‌పై దాడి చేసింది ఎవరో.. దేనితో దాడి చేశారో తెలియకముందే.. ఓ వర్గం మీడియా ‘గులకరాయి’తో దాడి చేశారంటూ ప్రచారం చేస్తున్నారు.

పోలీసుల విచారణలో నిజాలు వెలుగులోకి రావడంతో పాటు.. దాడి చేసిన నిందుతుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎల్లో మీడియాతో పాటు.. చంద్రబాబు, పవన్ తమ ప్రచార సభల్లో సీఎం జగన్ ‘గులకరాయి’ డ్రామాలను జనం నమ్మరంటూ పంచ్‌లు పేల్చుతున్నారు. మొత్తానికి ఆ కోడికత్తి మాదిరే గులకరాయిని కూడా హైలైట్ చేస్తున్నారు. కాగా టీడీపీ, జనసేన, ఎల్లో మీడియా ‘గులకరాయి’ డ్రామా అని సీఎం జగన్ గాయాన్ని హేళన చేస్తుంటే.. తానెందుకు చేయకూడదని అనుకుందో ఏమో గానీ.. యాంకర్ మంజూష కూడా సీఎం జగన్‌పై ‘గులకరాయి’ అంటూ కామెంట్లు చేసింది.

Anchor Manjusha
Anchor Manjusha

తన ఎదురుగా టీవీ5 మూర్తి ఉన్న ప్రభావమో ఏమో కానీ.. ఈమె కూడా సీఎం జగన్‌పై పంచ్‌లు పేల్చింది. తాజా ఇంటర్వ్యూలో యెల్లో జర్నలిస్ట్‌గా ముద్రపడి వైసీపీ వాళ్లతో తిట్లు తినే టీవీ5 మూర్తి.. ఎన్నికల ముందు దర్శకత్వ బాధ్యతలు నెత్తిన పెట్టుకున్నారు. నారా రోహిత్ హీరోగా ‘ప్రతినిధి 2’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈనెల 25న సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూర్తిని ఇంటర్వ్యూ చేసింది యాంకర్ మంజూష. ఈ సందర్భంలో ఈమెకు పెద్ద ధర్మసందేహమే వచ్చింది. రీసెంట్‌గా జగన్‌పై జరిగిన రాళ్ల దాడిని ప్రస్తావిస్తూ.. ఆయన కంటికి తగిలిన గాయాన్ని సినిమాలోని హీరో పాత్రకి లింక్ చేసింది. ఈ సినిమాలో హీరో నారా రోహిత్‌కి కన్ను దగ్గర గాయం కనిపిస్తుంది. ఇటీవల సీఎం జగన్‌ పై ఎటాక్ జరిగింది. మీరు ఈ షాట్ సీఎం జగన్ పై దాడి జరిగిన తరువాత తీశారా? ఎందుకంటే.. ఇద్దరికీ సేమ్ దెబ్బ.. సేమ్ కట్టు.. అందుకే డౌట్ వచ్చింది’ అని టీవీ 5 మూర్తిని అడిగింది యాంకర్ మంజూష.

- Advertisement -

అయితే మూర్తి సమాధానం ఇస్తూ.. ‘రెండింటికీ పెద్ద తేడా ఏం లేదండీ.. ఇక్కడ హీరోకి కుడి కన్ను దగ్గర గాయం ఉంటుంది.. అక్కడ సీఎంకి ఎడమ కంటి దగ్గర తగిలింది. ఇద్దరిదీ ఒకే కన్ను కాదు. టీజర్‌లో కూడా హీరో గారి కంటికి దెబ్బ ఉంటుంది. ఈ సీన్ ఇప్పుడు కావాలని తీసింది కాదు. సీఎం పై ఎటాక్ చేయడానికి ముందే తీశాం. రాజకీయ నాయకులపై రాళ్లు వేయడం కరెక్ట్ కాదని చెప్పిన జర్నలిస్ట్‌లపై కూడా రాళ్లు వేశారు. ఈ ఇన్సిడెంట్‌ని నేను ముందు ఊహించలేదు. రాళ్లు పడటం చాలా సహజం. ఈ సినిమా రిలీజ్ తరువాత నాపై కూడా రాళ్లు పడతాయి’ అని అన్నారు మూర్తి.

దాంతో యాంకర్ మంజూష మరో అడుగుముందుకేసి.. సీరియస్‌గా మొహం పెట్టి.. ‘హో.. డైరెక్ట్‌గా గులకరాయి అయితే కాదు కదా’ అంటూ ఆమె సీఎంని కొట్టమని గులకరాయి అందించినట్టుగా హేళనగా నవ్వింది. దీంతో వైసీపీ శ్రేణులు యాంకర్ మంజూషపై ఫైర్ అవుతున్నారు. కొట్టినోడు దొరికాడు.. కొట్టించినోడు బయటకు వస్తాడు. గులకరాయి డ్రామాలో.. నిజమైన డ్రామాలో త్వరలోనే తేలుతుంది కదా.. ఇలాంటి పిచ్చి డ్రామాలు మీరు ఇక ఆపేస్తే బాగుంటుంది. లేదంటే అవే రాళ్ల దెబ్బలు జనం చేతిలో మీరు తినాల్సి వస్తుందంటూ.. యాంకర్ మంజూషని.. టీవీ5 మూర్తిని బండబూతులు తిడుతున్నారు వైసీపీ నాయకులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here