Jagapatibabu : జగపతిబాబు ఇంట్లో దొంగతనం… ఆయన చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే !

- Advertisement -

Jagapatibabu : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం అవుతుందో ఎవరూ ఊహించలేరు. ఇండస్ట్రీలో నటిన‌టులుగా సక్సెస్ కొట్టాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ వచ్చిన క్రేజ్ నిలబెట్టుకోవాలని అదే రేంజ్ లో వారు శ్రమిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు అనగానే టక్కున గుర్తుకు వచ్చేది వారి లగ్జరీ లైఫ్. వీరు కేవలం భారీ రెమ్యునరేషన్ కొల్లగొట్టి స్టార్లుగా లగ్జరీ లైఫ్ అనుభవించడమే కాదు.. అప్పుడప్పుడు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. రియల్ లైఫ్ లోను హీరోలుగా పాపులారిటీ దక్కించుకుంటూ ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ అడిగిన వారికి కాదనకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. మహేష్ బాబు ఇప్పటికే తన సొంత ఊరిని దత్తత తీసుకోవడమే కాకుండా.. ఎంతోమంది అనాథలకు, పేదలకు గుండె ఆపరేషన్లు, చదువులు చెప్పించ‌టం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రశంసలందుకుంటున్నాడు.

ఇక చిరంజీవి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించే వ్యక్తి చిరంజీవి. అయితే గతంలో స్టార్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోయిన జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. అయితే ఈయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ బయటకు చెప్పుకోరు. అయినా ఆయన నుంచి సాయం పొందిన వారు ఆయన పట్ల ఇప్పటికీ కృతజ్ఞత చూపిస్తూనే ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ సంఘటన నెట్టింట వైరల్ గా మారింది. గతంలో జగపతిబాబు ఇంట్లో కొంతమంది దొంగలు పడ్డారట. జగపతిబాబు వారిని పట్టుకుని పోలీసులకు పట్టించారట.

- Advertisement -

ఇక జైల్లో ఉన్న ఆ దొంగల భార్యలు బాబు ఫోన్ నంబర్ కనుక్కొని.. ఆయనకు కాల్ చేసి వేడుకున్నారట. మా భర్తలు జైల్లో ఉండడం వల్ల మా జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. పిల్లా, పాపలతో రోడ్డుపైకి వచ్చేసాం అంటూ బాధను వ్యక్తపరిచారట. వాటికి కరిగిపోయిన జగపతిబాబు.. ఆ దొంగల కుటుంబాలకు నగదు రూపంలో కొంత సహాయం చేశాడట. ఒకసారి మాత్రమే అలా డబ్బులిచ్చి చేతులు దులిపేసుకోకుండా.. ఆ దొంగలు జైలు నుంచి రిలీజ్ అయ్యేంతవరకు ప్రతి నెల కొంత డబ్బును వారి కుటుంబాలకు ఇచ్చాడట. ఈ విషయం జగపతి బాబు స్వయంగా వివరించాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ కావడంతో ఆయన ఫ్యా్న్స్ ఆశ్చర్యపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here