Nikhil Siddharth : హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డాక్టర్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో అతడి భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇంతవరకు తన కొడుకును కానీ, బాబు పేరు కానీ పరిచయం చేయలేదు. అయితే ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న నిఖిల్ బాబు పేరుతో పాటు తండ్రైన తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చాడు. తన కొడుకు కోసం కొన్ని మార్చుకున్నానని.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఖాళీ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఈవెంట్లో నిఖిల్ మాట్లాడుతూ.. ‘బాబు పుట్టిన తర్వాత ఎక్కువ సమయంలో తనకే కేటాయిస్తున్నాను. మా అబ్బాయి పేరు ధీర సిద్ధార్థ్. తండ్రిగా బాబు బాధ్యతను పంచుకుంటున్నాను. ఎక్కువ సమయం వాడితోనే గడపుతున్నాను. వాడు పుట్టాక నా అలవాట్లు కొన్నింటిని మార్చుకున్నాను. వారానికి కనీసం ఒక్కసారైనా పార్టీకి వెళ్లడం స్వతహాగా నాకు అలవాటు. కానీ ఇప్పుడు పూర్తిగా వెళ్లడం మానేశాను. పేరెంట్స్ అయ్యాక పిల్లల కోసం కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలి. ఇలా మార్పు వచ్చినా నేను సంతోషంగానే ఉన్నాను. భర్తగా, తండ్రిగా ఇలా అన్ని రకాలుగా ఆనందంగానే ఉన్నాను. నా జీవితం ఇలా ఉంటుందని కొన్నేళ్ల క్రితం ఎవరైనా చెప్పి ఉంటే ఇన్నేళ్లు ఇంత ఒత్తిడికి గురయ్యేవాడినే కాదు” అంటూ చెప్పుకొచ్చాడు.
నిఖిల్ చివరగా స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన ‘స్వయంభు’లో మూవీతో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియాగా వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. భరత్ క్రష్ణమాచారి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. నభానటేష్ సెకండ్ లీడ్లో నటిస్తుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం కోసం అతడు మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీల్లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు.
Teary eyed and Emotional.. Life comes a full circle..
Just over a year ago I lost my father and today We Welcome a New Member into our family… Feels like it’s him back again.
Happy to share that Pallavi & Me Have a Cute little baby boy Delivered today 😇🥳 pic.twitter.com/B5yY5TCBNp— Nikhil Siddhartha (@actor_Nikhil) February 21, 2024