Actress Sreeleela : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ఫ్లాప్ అయినా.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చింది యంగ్ బ్యూటీ శ్రీలీల. పెళ్లి సందడి చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా అంతగా ఆడకపోయినా.. అందులో ఈ భామ అందాన్ని, క్యూట్ నెస్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేక్షకులతో పాటు నిర్మాతలు, డైరెక్టర్లు ఫిదా అయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్లాప్ ఫిల్మ్ తో ఎంట్రీ ఇచ్చినా ఈ భామకు వరుస అవకాశాలు ఇచ్చారు.
అలా వరుస ఛాన్సులతో హిట్ మీద హిట్ కొడుతూ సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. అందులో ధమాకా మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. ఆ చిత్రం తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా కలిసి రాలేదు. వరుసగా సినిమాలు ప్లాప్ అయ్యాయి. నితిన్ తో చేసిన ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్, వైష్ణవ్ తేజ్ తో చేసిన ఆదికేశవ, రామ్ పోతినేనితో చేసిన స్కంధ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి చిత్రం కాస్త ఫర్వాలేదు అనిపించింది.
ఇక ఆ చిత్రం తర్వాత వచ్చిన గుంటూరు కారం కూడా మంచి వసూళ్లు రాబట్టింది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో ఇక సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తన మెడిసిన్ కంప్లీట్ చేయాలనుకుంటుందట. అందుకే తనకు ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేస్తుందట. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సినిమా మాత్రమే ఉంది. ఇక విజయ్ దేవరకొండ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకుంది. ఇప్పుడు నితిన్ తో చేయాల్సిన రాబిన్ హుడ్ మూవీ నుంచి కూడా తప్పుకుందట శ్రీలీల.
రాబిన్ హుడ్ మూవీలో శ్రీలీలను రావిషింగ్ బ్యూటీ రాశీ ఖన్నా రీప్లేస్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అంతుకుముందు ఈ ప్రాజెక్టులో రష్మికను అనుకున్నారు.. ఆమె తప్పుకోవడంతో శ్రీలీలను ఓకే చేశారు. ఇక ఇప్పుడు ఆమె కూడా తప్పుకోవడంతో ఈ ఛాన్స్ రాశీ ఖన్నాకు వచ్చిందట . అయితే కొందరేమో శ్రీలీల తప్పుకోలేదని, రాశీ మరో పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఏమో గానీ దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తే కానీ అసలు సంగతి తెలియదు. ఇక నితన్ – రాశీ శ్రీనివాస కల్యాణం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.