kannappa : టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ ప్లస్ ఛానెల్లో ప్రసారమైన మహాభారత్ సిరీస్‌ను తెరకెక్కించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే వివిధ సినిమా ఇండస్ట్రీలకు చెందిన పలువురు స్టార్ నటులు ఇందులో భాగమయ్యారు. ఇక టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ చిత్రంలో భాగమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ చిత్ర బృందంలోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్లో సంవత్సరానికి నాలుగు హిట్లు అందిస్తూ దాదాపుగా ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యే బీ టౌన్ కలెక్షన్ కింగ్, కిలాడీ అక్షయ్ కుమార్ కన్నప్పలో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో భాగం కానున్నారని తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసింది.‘‘సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌ను తెలుగు చిత్ర పరిశ్రమలోకి స్వాగతం పలుకుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన భాగం కావడంతో కన్నప్ప మరింత ఉత్కంఠభరితంగా మారింది. మాకు థ్రిల్‌గా ఉంది. మర్చిపోలేని సాహసానికి సిద్ధంగా ఉండండి’’ అని ఈ వీడియో కింద క్యాప్షన్ కూడా ఇచ్చింది.
అయితే అక్షయ్ కుమార్ ఇప్పటి వరకు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయలేదు. గతంలో 1993లో ఓ కన్నడ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత 2018లో రజనీ హీరోగా తెరకెక్కిన రోబో2.0లో తమిళ పరిశ్రమకి పరిచమయ్యారు. ఆ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది. అయితే ఆ చిత్రంలో పక్షిరాజుగా యానిమేటెడ్ క్యారెక్టర్లో కనిపించడంతో అక్షయ్ నటన తెలుగు ప్రేక్షకులుగా అంతగా గ్రహించలేకపోయారు. ఇక ఇప్పుడు ఈ మూవీతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవల ‘ఓమైగాడ్2’లో అక్షయ్ శివుడిగా కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’లోనూ ఆయన ఆ మహదేవుడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు అక్షయ్ ఎంట్రీ ఇవ్వడంతో మలుపు తిరిగింది.
ఇక ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, శరత్ కుమార్ భాగమైన విషయం తెలిసిందే. విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ప్రభాస్, నయనతారలు కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో భరతనాట్యంలో నిష్ణాతురాలైన ప్రీతి కథానాయికగా కనిపించనున్నారు.
The #𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚🏹 journey just got more thrilling as we welcome the Superstar Mr. Akshay Kumar to the Telugu Film Industry. Thrilled to announce his debut in Telugu cinema with Kannappa. Get ready for an unforgettable adventure! 🎬❤️@akshaykumar #akshaykumar… pic.twitter.com/o7lnOJP3BH
— Vishnu Manchu (@iVishnuManchu) April 16, 2024