Keerthi Suresh : కీర్తి సురేష్ ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తన అందం అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో నిండిపోయింది. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. వాస్తవానికి కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం చాలా తక్కువ. మిగతా హీరోయిన్స్ ఎక్కువగా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి పాకులాడుతూ ఉంటారు. కానీ, వారందరికీ పూర్తి డిఫరెండ్ కీర్తి సురేశ్. చాలా పద్ధతిగా తన లిమిట్స్ లో తాను తన వర్క్ చేసుకొని వెళ్లిపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా స్కిన్ షో కి దూరంగా ఉండే కీర్తి సురేష్ ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక కచ్చితంగా ఎక్స్పోజింగ్ చేయాల్సిందే అన్న కామెంట్స్ మనం ఎప్పటినుంచో వింటున్నాము. మరి కీర్తి సురేష్ ఎక్స్పోజింగ్ చేస్తుందా ..?… కానీ ఇప్పటి వరకు సౌత్ సినిమాల్లో లాగానే ఫాలో అవుతుందా లేదంటే తన రూల్స్ ని బ్రేక్ చేస్తుందో ..?తెలియాలి అంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఇలాంటి క్రమంలోనే కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అంటూ కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి సమయంలోనే చాలా ట్రెడిషనల్ గా రెడీ అయిన కీర్తి సురేష్ తన ఫోటోని షేర్ చేస్తూ తన ఇన్ స్టా స్టోరీలో.. మీరు పెళ్లికి సిద్ధమైనప్పుడు సెల్ఫీ తప్పనిసరంటూ ఇక సెల్ఫీ షేర్ చేసింది. దీనితో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. “నువ్వు పెట్టిన పోస్ట్ కి అర్థం ..నువ్వు పెళ్లికి రెడీ అయ్యావా..? అని చెప్తున్నావా.. లేకపోతే వేరే వాళ్ల పెళ్లికి నువ్వు ముస్తాబు అయ్యావా..? అని చెప్తున్నావా అని కన్ఫ్యూషన్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ కీర్తి సురేశ్ షేర్ చేసిన పోస్ట్ కి అర్థం ఏంటి ..? ఆమె పెళ్లికి రెడీ అయినట్లా..? ఆమె పెళ్లికి ఆమె రెడీగా ఉన్నట్లా..? కొంచెం మీకైనా అర్థం అయిందా ?