Namitha : ఎన్నికల్లో హీరో విజయ్ పై పోటీకి సై అంటున్న స్టార్ హీరోయిన్

- Advertisement -

Namitha : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇటు లోక్ సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందడి షురువైంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఈసారి ఎన్నికల్లో చాలా మంది సినీ తారలు పోటీ చేస్తుండడంతో పరిస్థితి కొంచెం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నారు. 2026లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ‘తమిళగ వెట్రిక్‌ కళగం’ పేరుతో ఓ రాజకీయ పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో హీరో విజయ్ పై స్టార్ హీరోయిన్ నమిత తాను పోటీ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది.

Namitha
Namitha

వాస్తవానికి సౌత్ లో రజినీ కాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ హీరో విజయ్ కు ఉంటుంది. అతడి సినిమాల కోసం థియేటర్ల దగ్గర ఆయన అభిమానులు ఆత్రుతగా వెయిట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే నటుడు విజయ్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. విజయ్ పార్టీ పెట్టడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో హీరో విజయ్ పై పోటీకి స్టార్ హీరోయిన్ నమిత సై అంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ మీద పోటీ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది.

- Advertisement -

కాగా నమిత ప్రస్తుతం తమిళనాడు బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున నమిత చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. ఈ క్రమంలో 2026 ఎన్నికల్లో తాను బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్‌పై పోటీ చేస్తానని చెప్పింది నమిత. ఇటు విజయ్‌ కూడా రాజకీయాల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక నమిత చేసిన వ్యాఖ్యలపై విజయ్ అభిమానులు స్పందించారు. హీరో విజయ్ మీద నమిత పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని విజయ్ అభిమానులు అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here