Rakul Preet : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటిస్తుంటారు. అందుకే చేతిలో నాలుగు అవకాశాలు ఉండగానే.. చాలామంది నటినటులు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బిజినెస్ లలో రాణిస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే వ్యాపార రంగంలో అడుగు పెట్టి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు పబ్‌లు, మల్టీప్లెక్స్ లు, జిమ్, రెస్టారెంట్ ఇలా ఎన్నో బిజినెస్ లో అడుగుపెట్టి సక్సెస్ కొట్టారు. అలాంటి వారి జాబితాలో చేరింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.
ఇటీవల అంగరంగ వైభవంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో నటించింది. ఇక ఫిట్నెస్ కు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చే ఈ బ్యూటీ గతంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎఫ్ 45 పేరుతో జిమ్ సెంటర్ బ్రాంచ్‌లుగా ఓపెన్ చేసింది. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈ జిమ్‌లలో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఇదే కాకా వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాంచ్‌లలో కూడా రకుల్ ప్రీత్ ఇన్వెస్ట్ మెంట్లు పెడుతూ రాణిస్తోంది.
హెల్త్ అండ్ స్కిన్ రంగాల్లో కూడా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. 2019లో న్యూ బుక్ పేరుతో బయోడిక్రేటబుల్ డైపర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు మరో రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఆరంభం పేరుతో హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్ త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇందులో మిల్లెట్స్ తో తయారు చేసిన హెల్తీ ఫుడ్ తన కస్టమర్లకు అందించబోతుంది. ఇటీవల పెళ్లి చేసుకున్న రకుల్ ఇప్పుడు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టడం.. అది కూడా ఇలాంటి హెల్తీ బిజినెస్ రంగాన్ని ఎంచుకోవడం తన అభిమానులకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోంది. తన కొత్త బిజినెస్ లలో కూడా సక్సెస్ కావాలని కోరుతున్నారు.