Anchor Rashmi : కాబోయే భర్త పై ఓపెన్ అయిన యాంకర్ రష్మీ..!

- Advertisement -

Anchor Rashmi : యాంకర్ రష్మీ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగు సినీ ప్రేక్షకులకి రష్మీ సుపరిచితమే. రష్మీ ప్రస్తుతం ఒకవైపు సినిమాలు చేస్తూ ఇంకో పక్క యాంకర్ గా చేస్తోంది. బుల్లితెర ప్రేక్షకుల్ని అటు వెండితెర ప్రేక్షకుల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. జబర్దస్త్ ద్వారా పాపులారిటీని తెచ్చుకుంది ప్రస్తుతం జబర్దస్త్ షో తో పాటుగా ఎక్స్ట్రా జబర్దస్త్ అలానే పండుగ ఈవెంట్లకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. రష్మీ సుధీర్ జోడి కి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుందో కూడా మనకి తెలుసు. రష్మీ సుధీర్ ని పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఫాన్స్ అయితే కోరుకుంటుంటారు.

పైగా కొన్ని స్క్రిప్ట్ లలో వాళ్ళు పెళ్లి చేసుకోవడంతో జంటగా బాగుంటుందని టాక్ కూడా వచ్చింది వీళ్ళిద్దరి షోల కి రేటింగ్ కూడా బాగా వచ్చేది ప్రస్తుతం సుధీర్ సినిమాలతో బిజీగా ఉన్నారు బుల్లితెర మీద పెద్దగా కనిపించట్లేదు. రష్మీ సింగిల్ గా తన షోలు చేసుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా రష్మీ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.

- Advertisement -

సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు అభిమానులతో మాట్లాడుతుంటుంది కూడా. తాజాగా ఈమె తనకి ఎలాంటి భర్త కావాలో చెప్పింది. రీసెంట్ గా ఒక షోలో పాల్గొన్న రష్మీ మాట్లాడుతూ తనకి కాబోయే వాడు నేను చెప్పింది చేయాలి. చేసిందే నాకు చెప్పాలి అని చెప్పింది రష్మీ. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సుధీర్ అన్న పరిస్థితి ఏంటి అన్న ఎక్కడికి వెళ్ళాడు నీకు చెప్తున్నాడా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్. మరీ ఈ కామెంట్లు పై రష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here