Sandeep Reddy: సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ఇండస్ట్రిలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ను సందీప్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఎంత వరకు వచ్చింది, ఐడియా ఎలా వచ్చింది, మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అని ఇలా చాల విషయాలను వంగా ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒక హాలీవుడ్ మూవీని రీమేక్ చెయ్యడానికి ఫస్ట్ సందీప్ ను ప్రభాస్ అడిగాడు. కానీ సందీప్ ఒక ఒరిజినల్ ఐడియాతో వస్తానని చెప్పి, కొన్ని రోజుల తరువాత స్పిరిట్ ఐడియా తో ప్రభాస్ దగ్గరికి వెళ్ళాడు. బేసిక్ స్టోరీ లైన్, క్యారక్టర్ విని ప్రభాస్ మూవీ చెయ్యడానికి ఒప్పుకున్నాడని సందీప్ చెప్పాడు. అయితే మూవీలో ప్రభాస్ చుట్టూ చాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కానీ జనాలు మాత్రం ఆయన రియాక్షన్ కోసం వెయిట్ చేస్తారు కాబట్టి తానూ దానిమీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు సందీప్ తెలిపారు.

ఈ మూవీకి మొత్తం బడ్జెట్ 300ల కోట్లు అవుతుందని, ఫస్ట్ డే కలెక్షన్స్ మినిమమ్ 150 కోట్లు ఉంటుందని వంగా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అయితే మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతుందని, 60% కంప్లీట్ అయ్యిందని, ఈ డిసెంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తామని సందీప్ చెప్పాడు. అన్ని వర్క్ అవుట్ అయితే ఈ మూవీ 2000 కోట్లు కలెక్ట్ చేసినా పరేషాన్ అవ్వాల్సిన అవసరం లేదు.